న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: కోహ్లీ నుంచి నేర్చుకో.. రోహిత్‌కు మాజీ దిగ్గజం సలహా!

Former player advises Rohit Sharma to focus on his fitness

టీ20 వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న టీమిండియా సీనియర్ ప్లేయర్లు అందరూ బంగ్లా పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో బాగా విఫలమైన రోహిత్ శర్మ కూడా ఢాకా చేరుకున్నాడు.

టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైన రోహిత్ ఆటతీరుపై ఈ సిరీస్‌లో చాలా మంది ఫోకస్ పెడతారు. పొట్టి ప్రపంచకప్ వైఫల్యం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుని బంగ్లాదేశ్‌లో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.

ఫిట్‌నెస్‌పై ఫోకస్..

ఫిట్‌నెస్‌పై ఫోకస్..

ఇప్పుడు రోహిత్ బంగ్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో వీళ్లపై చాలా ఫోకస్ ఉంటుందని మాజీ క్రికెటర్ మనీందర్ సింగ్ అన్నాడు. రోహిత్ శర్మలో ఇంకా చాలా క్రికెట్ దాగుందని చెప్పిన ఆయన.. ఇకనైనా అతను ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలని సూచించాడు. ఈ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేరణగా తీసుకోవాలని, అతను చాలా కాలంగా ఎంత ఫిట్‌గా ఉన్నాడో మనందరికీ తెలిసిందేనని మనీందర్ సింగ్ అన్నాడు.

ధోనీ ఫీట్ రిపీట్ చేసే ఛాన్స్..

ధోనీ ఫీట్ రిపీట్ చేసే ఛాన్స్..

టీ20 వరల్డ్ కప్‌లో ఫీల్డింగ్ చేసే సమయంలో కూడా రోహిత్ చురుగ్గా కదల్లేకపోయాడని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. '2011లో ఎంఎస్ ధోనీ సాధించిన విజయాన్ని తను మళ్లీ రిపీట్ చేసే అవకాశం రోహిత్ శర్మ ముందు ఉంది. తనలో ఇంకా చాలా క్రికెట్ ఉందని నాకు నమ్మకం. ఇప్పటికైనా అతను తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెడితే మంచిది. టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఫిట్‌నెస్ సమస్య రోహిత్‌ను ఇబ్బంది పెట్టింది. ఈ విషయంలో విరాట్ కోహ్లీ నుంచి ప్రేరణ పొందాలి' అని మనీందర్ వివరించాడు.

రెస్ట్ ఉపయోగపడితే మంచిది..

రెస్ట్ ఉపయోగపడితే మంచిది..

పొట్టి ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకోవడం రోహిత్‌కు మేలు చేసి ఉంటుందని మనీందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తను ఎక్కడ ఫోకస్ పెట్టాలి? అనే విషయంలో ఒక స్పష్టత రావడానికి ఈ విశ్రాంతి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. వచ్చే వరల్డ్ కప్‌లో రోహిత్ చాలా పెద్ద పాత్ర పోషించాల్సి ఉంటుందన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ చాలా పేలవమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. జట్టుకు మంచి ఆరంభాలు అందించడంతో రోహిత్, రాహుల్ ఇద్దరూ విఫలమవడం తీవ్రంగా విమర్శలపాలైన సంగతి తెలిసిందే.

Story first published: Friday, December 2, 2022, 13:51 [IST]
Other articles published on Dec 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X