న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రషీద్ భాయ్ ధోనీ అని ఒకడున్నాడు.. వాని ఆటను చూస్తే ప్రజలంతా సచిన్‌ను మరిచిపోవడం ఖాయం!

Former Pakistan Captain Rashid Latif recalls how Tanvir Ahmed introduced MS Dhoni to him

కరాచీ: మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు వింటేనే ఎదో తెలియని వైబ్రేషన్.! చేజింగ్‌లో మహీ ఉన్నాడంటే.. భారత్ విజయం ఖాయమని ఓ సగటు అభిమాని ధీమా.! వికెట్ల వెనుక మహీ నిల్చున్నాడంటే.. ప్రత్యర్థి పనైపోయినట్లేనని భరోసా.! సారథిగా వ్యూహం పన్నాడంటే.. మ్యాచ్ మనదే అన్న నమ్మకం.! అంతలా ప్రపంచ క్రికెట్‌పై ధోనీ ప్రభావం చూపాడు.! దశాబ్దంన్నర పాటు తనదైన ఆటతో అభిమానులను అలరించిన ధోనీ.. ఆగస్టు 15న ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

చడీచప్పుడు లేకుండా టెస్టు క్రికెట్‌కు దూరమైన మహీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండానే తప్పుకున్నాడు.! ధోనీ అనూహ్య నిర్ణయంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు అనేక‌మంది మాజీ, సహచర క్రికెటర్లు ధోనీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

ధోనీ గురించి తన్వీర్ చెప్పాడు..

ధోనీ గురించి తన్వీర్ చెప్పాడు..

ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ధోనీ గురించి తొలిసారి విన్న మాటలను తన యూట్యూబ్ చానెల్ వేదికగా పంచుకున్నాడు. ధోనీ గురించి తనకు తొలి సారి తన్వీర్ అహ్మద్ చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. 2004లో తన్వీర్, ధోనీ కెన్యా టూర్‌లో ఏ జట్ల ట్రైసిరీస్ ఆడారని, తాను అప్పుడు ఇంగ్లండ్‌లో ఉన్నానని రషీద్ లతీఫ్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తనకు ఫోన్‌ చేసిన తన్వీర్.. ధోనీ అనే ఓ ఆటగాడు ఉన్నాడని, అతని ఆటను చూస్తే ప్రజలు సచిన్ మర్చిపోతారని చెప్పాడు. అయితే ఆ మాటలను తాను పెద్దగా పట్టించుకుపోగా.. అంతలేదన్నానని పేర్కొన్నాడు. కానీ తన్వీర్ చెప్పినట్టే సచిన్ అంత క్రేజ్‌ను ధోనీ సంపాదించుకున్నాడని తెలిపాడు.

ఆ మాటలు పట్టించుకోలేదు..

ఆ మాటలు పట్టించుకోలేదు..

‘2004 కెన్యా టూర్‌ వెళ్లిన తన్వీర్ నాతో అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి. ఆ సమయంలో నేను ఇంగ్లండ్‌లో ఉన్నా. ఫోన్‌లో అతనితో మాట్లాడాను. తన్వీర్ నాతో ‘రషీద్ భాయ్.. ఇక్కడ ఓ ఆటగాడున్నాడు.. వాడు కనుక అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెడితే ప్రజలు సచిన్ టెండూల్కర్‌ను మరిచిపోవడం ఖాయం'అని చెప్పాడు. అప్పుడు ఆ మాటలను అంతగా పట్టించుకోలేదు. కానీ ధోనీ.. సచిన్‌కు సమీపంగా వచ్చి అంతటి క్రేజును సంపాదించుకున్నాడు.'అని తన యూట్యూబ్ షో ‘కాట్ బిహైండ్'లో రషీద్ పేర్కొన్నాడు.

భారత్-ఏ జట్టులో ధోనీ విధ్వంసం..

భారత్-ఏ జట్టులో ధోనీ విధ్వంసం..

2004 కెన్యా పర్యటనలో పాకిస్థాన్ ఏ, భారత్‌ ఏ జట్లతో నిర్వహించిన ట్రై సిరీస్‌లో ధోనీ రెచ్చిపోయి ఆడాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 72.40 సగటుతో 360 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. అతని ఆటకు ముగ్ధుడైన పాకిస్థాన్ బౌలర్ తన్వీర్ అహ్మద్.. త్వరలోనే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెడతాడని, వరల్డ్ బెస్ట్ క్రికెటర్‌గా ఎదుగుతాడని అంచనా వేసాడు. ఆ విషయాన్ని రషీద్ లతీఫ్‌తో షేర్ చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్‌తో సెలక్టర్ల దృష్టిలో పడిన ధోనీ అనంతరం.. బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

ఇక ధోనీకి తిరుగులేదు..

ఇక ధోనీకి తిరుగులేదు..

తొలి మ్యాచ్‌లో రనౌటై గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగినా... అనంతరం పాకిస్థాన్‌తో వైజాగ్‌ వేదికగా జరిగిన వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన పేరును యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఆ మ్యాచ్‌లో 148 పరుగులు బాదగా తర్వాత శ్రీలంకపై 183 పరుగులు చేశాడు. అక్కడి నుంచి ధోనీ వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఇక 2007 నుంచీ 2017 వరకు పదేళ్లపాటు జట్టు సారథిగా కొనసాగడమే కాకుండా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సీఎస్‌కే పరిస్థితి మనకు రావచ్చు: కింగ్స్ పంజాబ్ కో ఓనర్ నెస్‌ వాడియా

Story first published: Friday, September 4, 2020, 13:12 [IST]
Other articles published on Sep 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X