ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సీఎస్‌కే పరిస్థితి మనకు రావచ్చు: కింగ్స్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా

న్యూఢిల్లీ: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టుకు వచ్చిన పరిస్థితే.. ఏదో ఒకరోజు మిగతా జట్లకు కూడా రావచ్చని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా అన్నారు. అలా అని ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఇక క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్ సెషన్‌కు సిద్దమైన సీఎస్‌కే జట్టులో ఇద్దరు ఆటగాళ్లతో పాటు 11 మంది సిబ్బందికి కరోనా పాజిటీవ్ అని తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు ఐసోలేషన్ పీరియడ్ పెరగ్గా.. వ్యక్తిగత కారణాలతో వైస్ కెప్టెన్ సురేశ్ రైనా లీగ్ నుంచి నిష్క్రమించాడు. దీంతో చెన్నై జట్టు తీవ్ర ఇబ్బందులో కూరుకుపోయింది.
ఓ వైపు కరోనా.. మరో వైపు ప్రాక్టీస్ దూరమై గదులకే పరిమితమవడంతో ఆ జట్టు ఆటగాళ్లలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే చెన్నై ఘటనపై స్పందించిన నెస్ వాడియా.. పీటీఐ వార్త సంస్థతో మాట్లాడుతూ.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొక తప్పదన్నాడు. చెన్నై జట్టు కష్టాలు.. అవే బోధించాయన్నాడు.

అప్రమత్తంగా ఉండాలి..
‘ఉత్తమమైన జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా.. ఏదో ఒక రోజు ఈ విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని సీఎస్‌కే జట్టు ఘటన తెలియజేసింది. కాబట్టి బయో బబుల్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు.. ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండాలి. బయోబబుల్‌లో ఉండాల్సిన వారెవరమో ముందే నిర్దారించుకోవాలి. ఎలాంటి ఘటననైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్దమై ఉండాలి.'అని వాడియా సూచించారు.

భయాందోళన అనవసరం..
ఇక అలా అని అనవసరంగా భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. బీసీసీఐ అంతర్జాతీయంగా రూపొందించిన ప్రొటోకాల్స్‌ను అమలు చేస్తోందన్నారు. ‘బీసీసీఐ అంతర్జాతీయంగా రూపొందించిన ఉత్తమమైన ప్రొటోకాల్స్‌ను అమల్లోకి తెచ్చింది. ఫుట్ బాల్ లీగ్స్‌నే పరిశీలిస్తే ఉత్తమమైన జాగ్రత్తలు తీసుకున్నా ప్రారంభంలో చాలా కేసులు వచ్చాయి. ప్రస్తుతం పరిస్థితి మెరుగైంది. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ముందు ముందు పరిస్థితులు మరింత మెరుగుపడుతాయి. అనుకూలంగా మారుతాయి'అని వాడియా తెలిపాడు.

నేను డిసైడ్ అవ్వలేదు..
ఇక తాను దుబాయ్‌కి వెళ్లే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. ‘నా ఐపీఎల్ ప్రణాళికలపై తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ నేను మాములుగా ఆటగాళ్లతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వను. ఎం జరుగుతుందోనని తెలుసుకోవడానికి హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో ఓ రెండు సార్లు మాట్లాడను. జూమ్, ఇతర ఆన్‌లైన్ వేదికల సాయంతో ఇంటరాక్ట్ అవ్వడం నాకు సౌకర్యంగా ఉంది'అని చెప్పుకొచ్చాడు.

కొత్త కోచ్.. సరికొత్త కెప్టెన్..
ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు గత 12 సీజన్లుగా టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కోత్త కోచ్ అనిల్ కుంబ్లే, నూతన సారథి కేఎల్ రాహుల్‌తో సరికొత్తగా బరిలోకి దిగుతున్న ఆ జట్టు.. ఈ సారైనా టైటిల్ కరువు తీర్చుకోవాలని భావిస్తోంది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించిన జట్టు.. అన్ని విధాలుగా సమాయత్తం అవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
రెండో సారి తండ్రైన ఆర్పీ సింగ్..!