న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Salman Butt: ఇక్కడో పేద్ద ఇలకథ మఫిలియా జరుగుతోంది.. పాక్ జట్టులో సగం మంది అలాంటోళ్లే.. నేను బెట్ కడతా?

Former Pak Skipper Salman Butt Controversy comments on Pakistan team, and He slams Every Aspect

పాకిస్థాన్ క్రికెటర్లు ట్విట్టర్‌ను ఎలా ఉపయోగిస్తారనే దానిపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక పాక్ లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ ఫైనల్లో క్యాచ్ మిస్ చేయడంతో ఆ జట్టుకు తీవ్ర నష్టం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇక క్యాచ్‌ ద్వారా ఆసియా కప్ ఫైనల్‌లో తమ జట్టు ఓటమి పాలయిందని, అందుకు తాను సారీ చెబుతున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 'క్యాచ్‌ల ద్వారా మ్యాచ్‌లు గెలుస్తాం. క్షమించండి. ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తాను. నేను నా బృందాన్ని నిరాశపరిచాను. అయినా సరే జట్టుకు చాలా సానుకూలాంశాలున్నాయి. @iNaseemShah, @HarisRauf14, @mnawaz94, అలాగే మొత్తం బౌలింగ్ ఎటాక్ చాలా బాగుంది. @iMRizwanPak చాలా బాగా పోరాడాడు.

టీమ్ అంతా తమ శాయశక్తులా ప్రయత్నించారు. శ్రీలంకకు అభినందనలు.' షాదాబ్ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పట్ల ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ షాదాబ్‌కు మద్దతుగా ఒక రీల్‌ను పోస్ట్ చేశాడు. షాదాబ్ నువ్వు గొప్ప ఫీల్డర్‌వి, నీ ప్రయత్నాలు బాగున్నాయి అనేలా అందులో ఉంది. ఇక సల్మాన్ భట్ ఈ ట్వీట్లను, రీల్స్ గురించి మాట్లాడుతూ.. వీళ్లు చేసిన ట్వీట్లు, రీల్స్ ముందుగా ప్లాన్ చేసినవేనని, మొత్తం టీంకు ఒకే మేనేజర్‌గా ఉన్నందున, వారే ఏం రాయాలో నిర్ణయిస్తారని అందువల్ల క్రికెటర్ల అభిప్రాయాలు ఇందులో పెద్దగా ఏమీ ఉండవని పేర్కొన్నాడు.

వీళ్ల బాగోతాలు నాకు తెలియనివి కావు

వీళ్ల బాగోతాలు నాకు తెలియనివి కావు

సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలో మాట్లాడుతూ..'తమాషా ఏమిటంటే.. షాదాబ్ కావొచ్చు, హసన్ కావొచ్చు. వారిద్దరి మేనేజర్ ఒకరే. ఆ మేనేజర్ ఒక ఆటగాడి గురించి ఒకలా పోస్టు చేస్తాడు. నేను బాగా ఆడలేదు నన్ను క్షమించండి అంటూ ప్రాధేయపడతాడు. దాన్ని సమర్థించేలా మరో ఆటగాడి సోషల్ మీడియా ఖాతా నుంచి అదే మేనేజర్ మరో పోస్ట్ చేస్తాడు.

ఏం లేదు సోదరా నువ్వు బానే ఆడావు.. వెల్ ప్లేయిడ్ అంటూ ఆ పోస్టులో పేర్కొంటాడు. వీళ్ల బాగోతాలు నాకు తెలియనివి కావు. ఇదో పెద్ద ఇలకథ మఫిలియా బ్యాచ్. వీళ్ల సర్కస్ ట్రిక్స్ గురించి నాకు తెలిసినంత వరకు సగం మంది పాక్ క్రికటర్లకు తమ ట్విట్టర్ అకౌంట్లలో వాళ్ల మేనేజర్లు ఏం ట్వీట్ చేస్తున్నారో కూడా తెలియదు. నేను కావాలంటే పందెం కూడా కడతాను.' అంటూ సల్మాన్ భట్ పేర్కొన్నాడు.

బ్యాటింగ్ లైనప్ ఎంత దృఢంగా ఉందో తెలుస్తుందిలే..!

ఇక ఆసియా కప్ ఫైనల్లో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు ఎంపికపై సల్మాన్ బట్ విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ సడెన్‌గా కుప్పకూలడం బట్టి టీ20 ఫార్మాట్‌లో జట్టు బ్యాటింగ్ లైనప్ ఎంత దృఢంగా ఉందో తెలుస్తూనే ఉందని సల్మాన్ బట్ దెప్పిపొడిచాడు. ఫైనల్లో కేవలం 54పరుగులకే పాక్ చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. మెరిట్‌పై ఎంపిక చేయని కొందరు ఆటగాళ్లు జట్టులో పాతుకపోయారంటూ భట్ సీరియస్ అయ్యాడు.

పాక్ జట్టుకు తగిన శాస్తే జరిగింది

పాక్ జట్టుకు తగిన శాస్తే జరిగింది

'ఆసియా కప్ ఫైనల్‌లో జట్టు ఓటమికి కారణం చాలా మంది ప్రెషర్, తొక్కతోలు అంటున్నారు. కాదు పాక్ జట్టుకు దక్కాల్సిన ఫలితమే దక్కిందని నేనంటాను. గత మూడేళ్లుగా జట్టులో పాతుకుపోయిన చర్యలకు ఇది నిజమైన ఫలితం. కాస్త ప్రెషర్ వస్తే బ్యాటింగ్ కుప్పకూలిపోతుందన్న మాట. కాస్త మెరుగైన బౌలింగ్ అటాక్‌లను ఆడలేక చేతులెత్తేస్తారన్న మాట, ఏదైనా అంటే ప్రెషర్ గేమ్ అంటూ సమర్థించుకోవాలన్నమాట, ఈ చర్యలన్నీ నాకు తెలియనివి కావు.

ఏదేమైనా ముమ్మాటికి పాక్ జట్టు బేషరతుగా తమను తాము నిందించుకోవాల్సిన రిజల్ట్ ఇది. గత మూడు సంవత్సరాల నుండి కనీసం రెండు హాఫ్ సెంచరీలు కూడా చేయలేని ఆటగాళ్లు ఇప్పటికీ జట్టులో తాపీగా తమ స్థానాల్లో ఆడుతూనే ఉన్నారు. వాళ్ల మీద చర్యలేవీ? అడిగేవారేరీ? అంటూ భట్ ఓ రేంజులో ఫైర్ అయ్యాడు.

 ఎన్నడు ఇన్ టైంలో ప్రకటించారని..?

ఎన్నడు ఇన్ టైంలో ప్రకటించారని..?

కట్ ఆఫ్ డేట్ దగ్గరపడుతున్నా T20 ప్రపంచకప్ జట్టును పాకిస్థాన్ ఇంకా ప్రకటించకపోవడం పట్ల సల్మాన్ భట్ సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. 'పాకిస్తాన్ జట్టు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో మార్పులకు సిద్ధంగా ఉంది. ఎన్నడన్న సకాలంలో జట్టును ప్రకటించిన బోర్డేనా ఇది. ఇప్పుడు మాత్రం కొత్తగా ఏం జరుగుతుందని... చివర్లో హడావుడిగా ప్రకటించడం, ప్రకటించాక మళ్లీ చివరి క్షణాల్లో మార్పులు జరగడం ఎవరికీ తెలియవు.

ఒకవేళ జట్టును ప్రకటించినప్పటికీ.. సెలెక్ట్ అయిన ఆటగాళ్లు నిబ్బరంగా ఉంటారా అంటే అది లేదు. తమ స్థానాలు ఎక్కడ ఉంటాయో ఉడుతాయో అనే డైలామా ఉండనే ఉంటది. చివరి క్షణంలో వాడు అందుబాటులోకి వచ్చాడని వీడిని తీసేరకం బోర్డు.' అంటూ సల్మాన్ భట్ తన అసహనాన్ని అంత చూపించాడు.

Story first published: Tuesday, September 13, 2022, 17:24 [IST]
Other articles published on Sep 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X