న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: మీకు కోచింగ్ ఇచ్చింది ద్రావిడేనా?.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై ఆగ్రహం!

Former legend slams virat kohli for dropping two catches

టీమిండియా ఫీల్డింగ్ మరోసారి విమర్శలపాలైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ వైఫల్యాలు భారత్‌ను బాగానే దెబ్బతీశాయి. ముఖ్యంగా స్లిప్స్‌లో భారత ఆటగాళ్లు చాలా పేలవంగా కదులుతూ కనిపించారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ లిటాన్ దాస్‌కు ఇలాగే రెండు సార్లు జీవనదానం లభించింది.

రెండు సార్లూ కోహ్లీనే..

రెండు సార్లూ కోహ్లీనే..

లిటాన్ దాస్‌కు రెండు సార్లు జీవనదానం లభించింది కోహ్లీ వల్లనే. రెండు క్యాచులూ క్లిష్టమైనవే కానీ.. కోహ్లీ వంటి ఆటగాడు రెండు క్యాచులు వదిలేయడం అందరికీ షాకిచ్చింది. వీటిలో మొదటి సారి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జరిగింది. ఎడ్జ్ తీసుకున్న బంతి కోహ్లీ కుడి వైపు వెళ్లింది. దాన్ని అందుకోవడానికి అతను చాలా కష్టపడినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో కూడా దాదాపు ఇలాంటి సీనే రిపీట్ అయింది. ఇలా రెండు సార్లు బతికిపోయిన దాస్.. 73 పరుగులు చేసి బంగ్లా స్కోరును 231 పరుగులకు చేర్చాడు.

అలా ఎవరైనా నిలబడతారా?

అలా ఎవరైనా నిలబడతారా?

ఇలా స్లిప్స్‌లో భారత ఆటగాళ్లు క్యాచులు జారవిడవడాన్ని మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. అసలు స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసే వాళ్లు నిలబడే పోస్చర్ కూడా సరిగా లేదని విమర్శించాడు. 'టీమిండియా ఆటగాళ్లు తీరికగా మోకాళ్లపై చేతులు పెట్టుకొని నిలబడుతున్నారు. అలా స్లిప్స్‌లో ఎవరూ నిలబడరు? అసలు వీళ్లకు స్లిప్స్‌లో క్యాచులు పట్టే కోచింగ్ ఇచ్చింది ద్రావిడేనా అని అనుమానం వస్తోంది. కెరీర్‌లో స్లిప్స్‌లోనే 200 పైగా క్యాచులు పట్టిన అతను ఏం నేర్పించాడో తెలియట్లేదు' అని గవాస్కర్ అన్నాడు.

బ్యాటింగ్‌లోనూ ఫెయిలే..

బ్యాటింగ్‌లోనూ ఫెయిలే..

బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా ఆటగాళ్లు నానాతిప్పలూ పడ్డారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (2) మరోసారి విఫలమయ్యాడు. స్పిన్‌కు పూర్తిగా సహకారం అందించిన పిచ్‌పై గిల్ (7), పుజారా (6), కోహ్లీ (1) కూడా చేతులెత్తేశారు. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన అక్షర్ పటేల్ (34) జట్టును ఆదుకున్నాడు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (42 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (29 నాటౌట్) అద్భుతమైన పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో టెస్టు సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.

Story first published: Sunday, December 25, 2022, 20:15 [IST]
Other articles published on Dec 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X