కెనడా టీ20 లీగ్‌లో యువరాజ్‌ సింగ్‌.. బీసీసీఐ అనుమతి ఉందా?

Yuvraj Singh Set To Play For Toronto Nationals In GL T20 Canada || Oneindia Telugu

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ 'గ్లోబల్‌ టీ20 కెనడా' లీగ్‌లో ఆడనున్నాడు. టొరంటో నేషనల్స్‌ జట్టు ఫ్రాంఛైజీ యువరాజ్‌ను గురువారం జట్టులోకి తీసుకుంది. త్వరలో గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్ రెండవ సీజన్ జరగనుంది. ఈ టీ20 లీగ్‌ కెనడాలోని బ్రాంప్టన్‌లో జులై 25 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే గ్లోబల్‌ టీ20 కెనడాలో యువరాజ్‌ సింగ్‌ ఆడేందుకు బీసీసీఐ నుండి అనుమతి లభించిందా? లేదా? అన్నది తెలియరాలేదు. ఇదివరకే విదేశీ లీగ్‌లలో ఆడడానికి అనుమతి కోరుతూ యువీ బోర్డుకు లేఖ కూడా రాశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్‌కు బీసీసీఐ అనుమతించే అవకాశాలు ఉన్నాయి. యువీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజున ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. 'యువరాజ్‌క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతను విదేశీ లీగ్‌లలో ఆడితే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు' అని తెలిపాడు.

ధోనీ సారథ్యంలో భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌లలో యువీ కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ షోతో 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అందుకున్నాడు. అనంతరం క్యాన్సర్‌ బారిన పడి అమెరికా వెళ్లి చికిత్స చేసుకున్నాడు. చికిత్స అనంతరం యువీ కెరీర్‌ అంతగా సాగలేదు. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురు కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.

యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువీ.. 2017లో చివరి వన్డే, టీ20 ఆడాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 21, 2019, 8:52 [IST]
Other articles published on Jun 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X