న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్ ప్రారంభంలో ధోనీ అవతారం చూసి అపార్థం చేసుకున్నా: మాజీ క్రికెటర్

Former India cricketer Aakash Chopra recalls the time he had shared with a young Dhoni back in 2004

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు 39వ ఏట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఈ జార్ఖండ్ డైనమైట్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహీతో గడిపిన క్షణాలను నేమరువేసుకున్నారు. ఇక భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కూడా ధోనీతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

కెరీర్ ప్రారంభంలో జులపాల జుట్టుతో ఉన్న ధోనీని చూసి అపార్థం చేసుకున్నానని ఈ క్రికెటర్ కమ్ కామెంటేటర్ తెలిపాడు. అతని అవతారం నచ్చక హెయిర్ కట్ చేసుకోవాలని కూడా సూచించానన్నాడు.

ధోనీ ప్రత్యేకం..

ధోనీ ప్రత్యేకం..

ఇక తన యూట్యూబ్ చానెల్ వేదికగా మహీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆకాశ్ చోప్రా.. 2004 భారత్-ఎ జింబాబ్వే, కెన్యా పర్యటనలో మహీతో గడిపిన మధుర జ్ఞాపకలను పంచుకున్నాడు. ‘రెండు దశాబ్దాలకు పైగా సాగిన నా క్రికెట్ కెరీర్‌లో చాలా మంది క్రికెటర్లను చూశాను. కొందరిని దగ్గరగా చూస్తే.. మరొకొందరిని దూరంగా పరిశీలించా. కొందరు ఆటపై దృష్టి సారిస్తే.. మరికొందరు ఫేమ్‌పై ఆసక్తి చూపారు. కొందరు ఒక్కో మెట్టు ఎక్కి విజయవంతమైతే.. మరికొందరు డైరెక్ట్‌గా సక్సెస్ సాధించారు. కానీ ధోనీ మాత్రం చాలా ప్రత్యేకం.

బాబు ఇది క్రికెట్ మైదానం..

బాబు ఇది క్రికెట్ మైదానం..

బంగారం రంగులోని పొడవాటి జుట్టు, ముఖంపై తెల్లని సన్ స్క్రీన్, కళ్లకు బ్రాండెడ్ అద్దా‌లు పెట్టుకున్న ధోనీని చూస్తే ఎవరైనా.. భయ్యా ఇది బాలీవుడ్ సెట్ కాదు. క్రికెట్ మైదానం పక్కకు తప్పుకోండని చెప్పకుండా ఉండలేరు. నేను ధోనీని అలా చూసినప్పుడు అదే అనుకున్నా. ఇక 2004 భారత్-ఏ జింబాబ్వే, కెన్యా పర్యటనలో నాకు జూనియర్ ఆటగాడైన ధోనీతో రూమ్ షేర్ చేసుకున్నా.

ధోనీని చూసిన తర్వాతే..

ధోనీని చూసిన తర్వాతే..

అప్పుడు ధోనీని ఏం తింటావంటే.. మీరేం ఆర్డర్ చేస్తే అదేనన్నాడు. ఎప్పుడు పడుకుంటావ్ అంటే.. మీరెప్పుడు లైట్ ఆఫ్ చేస్తే అప్పుడే అని సమాధానమిచ్చాడు. నిజం చెప్పాలంటే.. ఈ జుంపాల ఆటగాడు నాతో ఇలా ఉంటాడని అస్సలు ఊహించలేదు. నా ఇష్టమైనది తింటా.. తర్వాత పడుకుంటా.. అనే సమాధానం వస్తుందనుకున్నా. కానీ గొప్పతనం సింప్లిసిటీ నుంచే వస్తుందని ధోనీని చూసిన తర్వాతే అర్థమైంది. ధోనీది చాలా సాధారణ మనస్థత్వం.. ఎక్కువగా ఆలోచించే తత్వం.

ధోనీకి నా సలాం..

ధోనీకి నా సలాం..

ఇక అతని అవతారం నచ్చక... హెయిర్ కట్ చేసుకోమని సలహా ఇచ్చా. అలా ఉంటే అభిమానులు ఆట పట్ల అంకితభావం లేదనుకుంటారని చెప్పా. కానీ అతను మాత్రం‘నా హెయిర్‌ను కట్ చేసుకోను. నన్ను చూసిన తర్వాత అభిమానులే నా హెయిర్ స్టైల్ ఫాలో కావొచ్చు'అన్నాడు. ఇక ధోనీ హెయిర్ స్టైల్‌కు పాక్ మాజీ ప్రధాని పెర్వెజ్ ముషారఫ్ ఫిదా అయ్యాడు. ఇప్పటికీ ఏ మూలనో ధోనీ హెయిర్ స్టైల్‌తో ఉన్న వారు కనిపిస్తూనే ఉన్నారు. ఇంతలా పాపులారిటీ సంపాదించిన ధోనీకి, అతని ఆత్మవిశ్వాసానికి నా సలాం'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

MS Dhoni Birthday: మసకబారుతున్న భారత క్రికెట్‌కు వెలుగునిచ్చిన మహేంద్రుడు!

Story first published: Tuesday, July 7, 2020, 18:00 [IST]
Other articles published on Jul 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X