న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని చూసి నేర్చుకోవాలి: బ్యాటింగ్‌లో జోరూట్ విఫలంపై మైక్ బ్రార్లీ

Former England captain Mike Brearley wants Joe Root to learn one thing from Virat Kohli

హైదరాబాద్: బ్యాటింగ్ విషయంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఒకటి నేర్చుకోవాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రార్లీ సూచించాడు. మోడ్రన్ డే క్రికెట్‌లో వీరిద్దరూ దిగ్గజ క్రికెటర్లుగా వెలుగొందుతున్నప్పటికీ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలుస్తోన్న రేట్ జోరూట్‌తో పోలిస్తే కోహ్లీదే ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు.

మూడో ఏడాది 1000కి పైగా: 24వ టెస్టు సెంచరీతో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులివేమూడో ఏడాది 1000కి పైగా: 24వ టెస్టు సెంచరీతో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులివే

తాజాగా, డైలీమెయిల్‌ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మైక్ బ్రార్లీ మాట్లాడుతూ "జోరూట్ అద్భుతమైన బ్యాట్స్‌మన్. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువగా అతడు 50 నుంచి 100 పరుగుల మధ్యలో ఔటవుతున్నాడు. అయితే, 50లను 100పరుగులుగా మలచడంలో కష్టపడుతున్నాడు" అని అన్నాడు.

కోహ్లీ సక్సెస్ రేట్ 59 నుంచి 60 శాతం

కోహ్లీ సక్సెస్ రేట్ 59 నుంచి 60 శాతం

"విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలుస్తోన్న రేట్ 59 నుంచి 60 శాతం వరకూ ఉంది. అదే రూట్ విషయంలో 25 శాతంగా ఉంది. ఇది గమనించాల్సిన విషయం. ప్రస్తుతం మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో అత్యుత్తమ క్రికెటర్లుగా వెలుగొందుతున్న ఐదు లేదా నలుగురు ఆటగాళ్లలో వీరిద్దరూ ఉన్నారు" అని మైక్ బ్రార్లీ తెలిపాడు.

షాట్ల ఎంపికలో జో రూట్ మరింత పరిణితి కనబర్చాలి

షాట్ల ఎంపికలో జో రూట్ మరింత పరిణితి కనబర్చాలి

"10 ఏళ్లు గడిచాయి, మీకు తెలుసు. నాకు అయితే సమాధానం తెలియదు. టెస్టుల్లో జో రూట్ ఔటయ్యే విధానం అలానే ఉంది. షాట్ల ఎంపికలో జో రూట్ మరింత పరిణితి చూపించాల్సి ఉంటుంది. 70ల్లో ఉన్నప్పుడు జో రూట్ షాట్ల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహారించాలి" అని బ్రార్లీ పేర్కొన్నాడు.

టెస్టుల్లో 24వ సెంచరీని నమోదు చేసిన కోహ్లీ

ఇంగ్లీషు గడ్డపై కనపర్చిన ఫామ్‌ని కోహ్లీ స్వదేశంలో కూడా కొనసాగిస్తున్నాడు. తాజాగా, రాజ్‌కోట్ వేదికగా వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ 184 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.

బ్రాడ్‌మాన్ తర్వాత అత్యంత వేగంగా 24 టెస్టు సెంచరీలు

123 ఇన్నింగ్స్‌ల్లో 24వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత అత్యంత వేగంగా 24 టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 125 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్‌ కోహ్లీకి ఇది 50వ సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ.

అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో

కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టక ముందు 250 ఇన్నింగ్స్‌ల్లో 29 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 134 ఇన్నింగ్స్‌ల్లోనే 30 సెంచరీలు సాధించడం విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి వచ్చి చేరింది. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండోస్థానానికి చేరుకున్నాడు. 23 సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా (29) తర్వాతి స్థానంలో నిలిచాడు.

Story first published: Monday, October 8, 2018, 13:51 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X