న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మళ్లీ వెస్టిండీస్‌ జెర్సీ ధరించి క్రికెట్ ఆడాలనుకుంటున్నా'

Former Cricketer Dwayne Bravos Congratulatory Message For New Captain Kieron Pollard

ఆంటిగ్వా: అక్టోబర్ 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో సంచలన వ్యాఖ్యలు చేసాడు. మళ్లీ నన్ను నేను విండీస్‌ జెర్సీలో చూసుకోవాలనుకుంటున్నా, విండీస్‌ తరఫున ఆడాలనుకుంటున్నా అని బ్రేవో తన మనసులోని మాటలను బయటపెట్టాడు. విండీస్‌ వన్డే, టీ20 జట్లకు ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ను కెప్టెన్‌గా నియమించిన నేపథ్యంలో బ్రేవో పై వ్యాఖ్యలు చేసాడు.

<strong>డబ్బుతో అత్యాచార ఆరోపణలు పక్కదారి: రొనాల్డోపై మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు</strong>డబ్బుతో అత్యాచార ఆరోపణలు పక్కదారి: రొనాల్డోపై మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు

కెప్టెన్‌గా పొలార్డ్‌:

కెప్టెన్‌గా పొలార్డ్‌:

ప్రపంచకప్‌2019లో విండీస్ పూర్తిగా నిరాశపరిచింది. మొత్తం 10 జట్లు మెగా టోర్నీలో పాల్గొనగా.. 9వ స్థానంలో నిలిచింది. అనంతరం టీమిండియాతో జరిగిన ద్వైపాక్షిక వన్డే, టీ20, టెస్ట్ సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో వన్డే కెప్టెన్ హోల్డర్, టీ20 కెప్టెన్ బ్రాత్‌వైట్‌లపై క్రికెట్ వెస్టిండీస్ వేటు వేసి.. పొలార్డ్‌ను కెప్టెన్‌గా నియమించింది. అయితే టెస్టుల్లో మాత్రం హోల్డర్ కొనసాగనున్నాడు. 2020 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని విండీస్ ఈ మార్పులు చేసింది.

కెప్టెన్‌ అర్హతలు నీలో ఉన్నాయి:

కీరన్‌ పొలార్డ్‌ను కెప్టెన్‌గా నియమించిన నేపథ్యంలో బ్రేవో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో స్పందించాడు. 'నా స్నేహితుడు పొలార్డ్‌కు శుభాకాంక్షలు. విండీస్‌ కెప్టెన్‌ అయ్యే అన్ని అర్హతలు నీలో ఉన్నాయి. విండీస్‌ జట్టును ముందుండి నడిపించి అత్తుత్తమ కెప్టెన్ అవుతావని ఆశిస్తున్నా. మళ్లీ వెస్టిండీస్‌ జెర్సీ ధరించి క్రికెట్ ఆడాలనుకుంటున్నా' అని బ్రేవో రాసుకొచ్చాడు. దీనికి హాస్యపూరితమైన కొన్ని ఎమోజీలను కూడా జత చేశాడు. దీనికి పొలార్డ్‌ 'థాంక్స్‌ సోల్జర్‌' అని రిప్లై ఇచ్చాడు.

 2016లో చివరి వన్డే:

2016లో చివరి వన్డే:

32 ఏళ్ల పొలార్డ్‌ విండీస్ తరపున చివరిసారిగా 2016లో వన్డే ఆడాడు. 2019 ప్రపంచకప్‌లో పొలార్డ్‌కు చోటు దక్కకపోయినా.. స్టాండ్‌ బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. టీమిండియాతో ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. ఈ భారీ హిట్టింగ్ ఆల్ రౌండర్ ఇప్పటివరకు 101 వన్డేలు ఆడాడు. 25.71 సగటుతో 2,289 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఈ ఫార్మాట్‌లో 50 వికెట్లు కూడా పడగొట్టాడు. పొలార్డ్‌ 62 టీ20 మ్యాచ్‌లలో 21.50 సగటుతో 903 పరుగులు చేసి, 23 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, September 10, 2019, 16:08 [IST]
Other articles published on Sep 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X