న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ టెస్టు సిరిస్‌లో ఆస్ట్రేలియా జట్టు మెంటార్‌గా స్టీవ్ వా

 Former captain Steve Waugh to mentor Australia during Ashes

హైదరాబాద్: గతేడాది జరిగిన బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్ ఇమేజిని మసకబార్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బాల్ టాంపరింగ్ ఉదంతం నుంచి బయట పడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా జట్టుకు సాయపడేందుకు మాజీ దిగ్గజాల సాయం తీసుకుంటున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అసిస్టెంట్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో రికీ పాంటింగ్ ఆసీస్ ఆటగాళ్లకు బ్యాటింగ్ టెక్నిక్స్‌లో విలువైన సలహాలు, సూచనలు చేస్తున్నాడు. ప్రపంచకప్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌తో యాషేస్ టెస్టు సిరిస్ ఆడనుంది.

యాషెస్ టెస్టు సిరిస్ కోసం

యాషెస్ టెస్టు సిరిస్ కోసం

దీంతో యాషెస్ టెస్టు సిరిస్ కోసం ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాను మెంటార్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. ఆగస్టులో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ టెస్టు సిరిస్ జరగనుంది. ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ వా మెంటార్‌గా ఎంపికై విషయాన్ని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ ధ్రువీకరించాడు.

స్టీవ్ వా నాయకత్వంలోని

స్టీవ్ వా నాయకత్వంలోని

2001లో చివరగా స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లీషు గడ్డపై యాషెస్ సిరిస్‌ను నెగ్గింది. టిమ్ పైన్ మాట్లాడుతూ "నాకు తెలుసు... జస్టిన్ లాంగర్ నేను కొంత భిన్నంగా ఆలోచిస్తున్నాం. మాజీ లెజెండరీ క్రికెటర్లను జట్టుతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం" అని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌తో అన్నాడు.

వరల్డ్ కప్‌లో రికీ పాంటింగ్

వరల్డ్ కప్‌లో రికీ పాంటింగ్

వరల్డ్ కప్ సమయంలో రికీ పాంటింగ్, టెస్టు సిరిస్ సందర్భంగా స్టీవ్ వా. స్టీవ్ వా ఓ లెజెండ్. స్టీవా వా సలహాలు మాకెంతగానో ఉపయోగపడతాయి. అతడి సేవలను వినియోగించుకోవడం కెప్టెన్‌గా నాకెంతో సంతోషంగా ఉంది. టెస్టు సిరిస్‌ సందర్భంగా అతడు మాతో ఉండటం టీమ్ మొత్తానికి మంచిది" అని టిమ్ పైన్ తెలిపాడు.

168 టెస్టులు ఆడిన స్టీవ్ వా 32 సెంచరీలు

168 టెస్టులు ఆడిన స్టీవ్ వా 32 సెంచరీలు

ఆస్ట్రేలియా గ్రేటెస్ట్ దిగ్గజాల్లో స్టీవ్ వా ఒకరు. మొత్తం 168 టెస్టులు ఆడిన స్టీవ్ వా 32 సెంచరీలు నమోదు చేశారు. అత్యధికంగా ఇంగ్లాండ్‌పై 32 టెస్టులు ఆడారు. యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ఎడ్డిబాస్టన్ వేదికగా ఆగస్టు 1న ప్రారంభం కానుంది.

Story first published: Thursday, July 4, 2019, 12:44 [IST]
Other articles published on Jul 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X