న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వికెట్ పడింది: ఉపాధ్యక్ష పదవికి వెంగసర్కార్ రాజీనామా

టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. లోధా కమిటీ సిఫారసులను అమలు చేయాలని జనవరి 2వ తేదీన సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఎంసీఏ ఉపాధ్యక్ష పదవికి వెంగసర్కార్ రాజీనామా చేశారు.

ధోని సంచలన నిర్ణయంతో ఆశ్చర్యం: ట్విట్టర్‌లో ఎవరేమన్నారు?

ఈ విషయాన్ని ఎంసీఏకు రాసిన లేఖలో వెంగ్ సర్కార్ వెల్లడించారు. ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ తప్పుకున్న సంగతి తెలిసిందే. 70 ఏళ్లకు పైబడిన వారు క్రికెట్ పరిపాలన వ్యవహారాలు చూసేందుకు దూరంగా ఉండాలంటే లోధా కమిటీ సూచించడంతో పవార్ ఆ పదవి నుంచి గతేడాది డిసెంబర్ 17న తప్పుకున్నారు.

Former captain Dilip Vengsarkar resigns as MCA vice president

ఇదిలా ఉంటే ఎంసీఏ వైస్ ప్రెసిడెంట్‌గా వెంగ్ సర్కార్ గతంలో రెండుసార్లు సేవలందించారు. 2002 నుంచి 2010 మధ్యకాలంలో వెంగసర్కార్ ఎంసీఏ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. దాంతో ప్రస్తుత ఉపాధ్యక్ష పదవిని వెంగసర్కార్ వదులుకోవాల్సి వచ్చింది.

కెప్టెన్‌గా ఒక శకం ముగిసింది: ధోని సాధించిన విజయాలివే

క్రికెట్‌లో సంస్కరణల అమలు కోసం ఏర్పాటు చేసిన లోధా కమిటీ బీసీసీఐలో, దాని అనుబంధ సంఘాల్లో పనిచేసే వారితో పాటు అధికారులకు వయస్సు పరిమితి, కాలపరిమితి ఉండాలని లోధా కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారులకు సుప్రీం ఆమోద ముద్రవేయడంతో వెంగసర్కార్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X