న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంతోషంగా ఉన్నా: చనిపోయాడంటూ వచ్చిన వార్తలపై మెక్‌కల్లమ్‌

Former Black Cap Nathan McCullum responds to rumours of his death

హైదరాబాద్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ ఎక్కువయ్యాయి. తాజాగా న్యూజిలాండ్‌ క్రికెటర్‌ నాథన్‌ మెక్‌కల్లమ్‌ను సోషల్‌మీడియా వేదికగా చంపేశారు. దీంతో ఆయన అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు అతని మరణానికి సంతాపం తెలియజేస్తూ ట్విట్టర్‌లో సందేశాలను పోస్టు చేశారు.

<strong>పృథ్వీ షా స్థానాన్ని రోహిత్‌ శర్మతో భర్తీ చేస్తే మంచిది: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్</strong>పృథ్వీ షా స్థానాన్ని రోహిత్‌ శర్మతో భర్తీ చేస్తే మంచిది: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

అయితే, తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలపై నాథన్‌ మెక్‌కల్లమ్‌ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. దీంతో ట్విట్టర్ వేదికగా తాను బతికే ఉన్నానంటూ అభిమానులకు తెలియజేశాడు. "నేను చావలేదని.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో సహచరులతో సంతోషంగా ఉన్నాను" అని ఓ ట్వీట్‌ చేశాడు.

తనపై వచ్చిన అసత్య వార్తలను నమ్మెద్దని, ఈ ఫేక్‌ వార్తకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నాథన్‌ మెక్‌కల్లమ్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌ తరపున నాథన్‌ మెక్‌కల్లమ్‌ 84 వన్డేలు, 63 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 2011 సీజన్‌లో పూణె వారియర్స్‌ తరుపున ఆడాడు.

2015లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. నాథన్‌ మెక్‌ కల్లమ్‌ ఎవరో కాదు న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ సోదరుడే.

Story first published: Saturday, December 1, 2018, 17:42 [IST]
Other articles published on Dec 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X