న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌ భారీ హిట్టర్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌ ఇకలేరు!!

Former big-hitting New Zealand batsman Jock Edwards dead at 64

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌లో భారీ హిట్టర్‌గా పేరుగాంచిన మాజీ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌ (64) కన్నుమూశారు. ఎడ్వర్డ్స్‌ మరణించిన విషయాన్ని ఆ దేశ సెంట్రల్‌ డిస్ట్రిక్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సోమవారం ఓ ప్రకటనలో ధృవీకరించింది. అయితే జాక్‌ ఎడ్వర్డ్స్‌ మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అనారోగ్యంతోనే మరణించారని సమాచారం తెలుస్తోంది.

సీఎస్‌కేకు ముంబై నుంచి ముప్పు పొంచిఉంది: మంజ్రేకర్సీఎస్‌కేకు ముంబై నుంచి ముప్పు పొంచిఉంది: మంజ్రేకర్

క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానుల్ని అలరించిన ఎడ్వర్డ్స్‌ ఇక లేరని విషయం తమకు తీరని లోటని సెంట్రల్‌ డిస్ట్రిక్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. 1974-85 మధ్య కాలంలో క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఎడ్వర్డ్స్‌.. కివీస్ జట్టు తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు, ఎనిమిది అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. ఇక 64 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లను ఎడ్వర్డ్స్‌ ఆడారు. 1978లో ఆక్లాండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలు సాధించడం అతని కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది.

అంతర్జాతీయ క్రికెట్‌ను కేవలం నాలుగేళ్లు మాత్రమే ఆస్వాదించిన జాక్‌ ఎడ్వర్డ్స్‌ తన ఆటతో భారీ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత ఆధునిక క్రికెట్‌కు అచ్చం సరిపోయే ఎడ్వర్డ్స్‌.. 2011లో స్థానిక న్యూస్‌ పేపర్‌ నెల్సన్‌ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తన బ్యాటింగ్‌ స్టైల్‌ టీ20 క్రికెట్‌కు సరిపోతుందనే విషయాన్ని స్పష్టం చేశారు.

తన దూకుడైన ఆటను అడ్డుకట్ట వేసేందుకు కోచ్‌లు ప్రత్యేకంగా ప‍్రణాళికలు సిద్ధం చేసుకునే వారని మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జాక్‌ ఎడ్వర్డ్స్‌ పేర్కొన్నారు. తనకు హిట్టింగ్‌ అంటే ఇష్టమనే విషయాన్ని కూడా ఆ ఇంటర్యూలో తెలిపారు. ఎడ్వర్డ్స్‌ తన చివరి టెస్టు మ్యాచ్‌ను, వన్డే మ్యాచ్‌ను భారత్‌పైనే ఆడటం గమనార్హం. ఇటీవలే ఇద్దరు మాజీ ఫుట్ బాల్ ఆటగాళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే.

Story first published: Monday, April 6, 2020, 15:53 [IST]
Other articles published on Apr 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X