For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు... ఏ ఛానెల్‌ నీది’

సోమవారం ముంబైలో బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయంలో ఎదురవుతున్న విషయాలపై ప్రధానంగా చర్చించారు.

By Nageshwara Rao

హైదరాబాద్: సోమవారం ముంబైలో బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయంలో ఎదురవుతున్న విషయాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ చ్చారు.

లోధా కమిటీ సిఫారసుల మేరకు 70 ఏళ్లు పైబడిన వారు క్రికెట్ సంఘాల్లో ఉండకూడదని ఓ నియమం ఉంది. అయితే శ్రీనివాసన్ వయసు 72 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో సోమవారం సర్వసభ్య సమావేశం అనంతరం బయటకు వచ్చిన శ్రీనివాసన్‌ను మీడియా ప్రశ్నించింది. 72 సంవత్సరాలున్న మీరు ఈ సమావేశానికి ఏ విధంగా అర్హులు అని ఓ జర్నిలిస్ట్ అడిగిన ప్రశ్నకి శ్రీనివాసన్‌కు పట్టరాని కోపం వచ్చింది.

Former BCCI president N Srinivasan loses his cool when asked why he attended BCCI SGM

వెంటనే ఆయన సదరు ఆ జర్నలిస్ట్‌ను 'నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు. ఏ ఛానెల్‌ నీది' అంటూ ఘాటుగా స్పందించారు. అనంతరం 'నీకు అభినందనలు. నన్ను మాట్లాడనివ్వకుండా చేశావు. ఆ మాట అడగడానికి నీకు ఏం హక్కు ఉంది' అంటూ జర్నలిస్ట్‌పై మండిపడ్డారు.

ఆ తర్వాత కొంత సమయం తీసుకుని శ్రీనివాసన్ లోధా కమిటీ సిఫారసుల అమలుకు ఏకగ్రీవంగా ఆమెదం తెలిపినట్లు ఆయన చెప్పారు. లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి పేర్కొన్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+