న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లా మాజీ క్రికెట‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌!!

Former Bangladesh cricketer Nafees Iqbal tests positive for Coronavirus

ఢాకా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు పంజా విసురుతోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. డాక్టర్లు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులకు సైతం కరోనా సోకింది. తాజాగా బ‌ంగ్లాదేశ్ మాజీ క్రికెట‌ర్ న‌ఫీస్ ఇక్బాల్‌‌కు క‌రోనా వైరస్ సోకింది. 2003 నుంచి 2006 మ‌ధ్య బంగ్లాదేశ్ ఓపెన‌ర్‌గా ఉన్న న‌ఫీస్‌కు కరోనా పాజిటివ్‌ అని శ‌నివారం నిర్ధ‌ర‌ణ అయింది.

ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ వ‌న్డే కెప్టెన్ త‌మీమ్ ఇక్బాల్ సోద‌రుడే న‌ఫీస్ ఇక్బాల్‌. 34 ఏళ్ల న‌ఫీస్ బంగ్లాదేశ్ తరఫున 11 టెస్టులు, 16 వ‌న్డేలు ఆడాడు. టెస్టులో 518 పరుగులు, వన్డేల్లో 309 పరుగులు చేశాడు. న‌ఫీస్ ఇక్బాల్‌ ప్ర‌స్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. 'నేను ప్రమాదకర వైరస్ బారిన పడ్డాను. ప్రస్తుతం చిట్టగాంగ్‌లోని మా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను' అని న‌ఫీస్ స్వయంగా ధృవీకరించినట్లు డైలీ స్టార్ వార్తాపత్రిక ఓ ప్రకటనలో తెలిపింది.

గత నెలలో బంగ్లాదేశ్ డెవ‌ల‌ప్‌మెంట్ కోచ్ అషీఖుర్ ర‌హ‌మాన్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే‌. ఇక పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ షాహిదీ ఆఫ్రిదితో పాటు మ‌రో ఇద్ద‌రు పాకిస్థానీ క్రికెట‌ర్ల‌కు (తౌఫీక్ ఉమర్, జాఫర్ సర్ఫరాజ్) క‌రోనా సోకినట్లు నిర్ధ‌ర‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ కుటుంబంలో తాజాగా కరోనా వైరస్‌ కలకలం సృష్టించింది. శనివారం అతని సోదరుడు, మాజీ రంజీ క్రికెటర్‌ స్నేహశీష్‌ సతీమణికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. గంగూలీ వదినతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా వైరస్‌ బారినపడ్డారు.

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు దాదా ప్రయత్నాలు కొనసాగిస్తుంటే.. ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటం భారత క్రికెట్‌ వర్గాలను కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క్రికెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. వ‌చ్చే నెల 8 నుంచి వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌ను పూర్తి బ‌యో సెక్యూర్ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది.

'ప్రపంచ క్రికెట్‌లో జడేజానే బెస్ట్ ఫీల్డర్.. జడ్డూను మించిన సేఫ్‌ హ్యాండ్స్‌ లేవు‌''ప్రపంచ క్రికెట్‌లో జడేజానే బెస్ట్ ఫీల్డర్.. జడ్డూను మించిన సేఫ్‌ హ్యాండ్స్‌ లేవు‌'

Story first published: Saturday, June 20, 2020, 17:05 [IST]
Other articles published on Jun 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X