న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇయర్ ఎండ్ స్పెషల్ 2018: టెస్టుల్లో టాప్ లేపిన టీమిండియా క్రికెటర్లు వీరే..

 Flashback 2018: Top Test innings by India batsmen: From Kohli to Shaw

హైదరాబాద్: 2018 సంవత్సరంలో టీమిండియా విదేశీ పర్యటనలతో పాటు స్వదేశాల్లోనూ జరిగిన టోర్నీల్లో విజయవంతంగా నిలిచింది. కొన్నింటిలో సమష్టిగా సంతృప్తికర ప్రదర్శన చేయలేకపోయినా.. వ్యక్తిగతంగా అత్యుత్తమంగా రాణించారు క్రికెటర్లు. ఈ జాబితాలో నిస్సందేహంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్సే ముందునిలిచాడు. ఈ జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే..

 విరాట్ కోహ్లీ, 153 సెంచూరియా

విరాట్ కోహ్లీ, 153 సెంచూరియా

సెంచూరియా వేదికగా దక్షిణాఫ్రికా ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే 335 పరుగులు చేసింది. సొంత గడ్డపై చెలరేగి ఆడిన సఫారీలు భారత ఫేసర్లను సునాయాసంగా తేల్చేశారు. అంతే ధీటుగా భారత బ్యాట్స్‌మన్‌ను కూలగొట్టారు. కానీ, విరాట్ కోహ్లీని మాత్రం అవుట్ చేయలేకపోయారు. అద్భుతంగా రాణించి 217బంతుల్లో 153పరుగులు చేయగలిగాడు. దీంతో భారత్ 307 స్కోరులో సగానికిపైగా స్కోరు విరాట్ వ్యక్తిగతమే. కానీ, దురదృష్టవశాత్తు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ అనుకున్నంత రాణించకపోవడంతో మ్యాచ్‌ను ఓడించపోయింది.

విరాట్ కోహ్లీ 149

విరాట్ కోహ్లీ 149

కేప్ టౌన్ ఇన్నింగ్స్‌లో భారత్ పేలవ ప్రదర్శననే కొనసాగించింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఆఖరిగా అవుట్ అయింది మాత్రం విరాట్ కోహ్లీనే. ఇంగ్లాండ్ జట్టును 287 పరుగులకు కట్టడి చేసిన భారత్.. చేధనకు దిగింది. కోహ్లీ భారత ఇన్నింగ్స్‌ను భుజాల వేసుకుని నడిపించాడు. 149పరుగులు బాది స్టేడియంను బౌండరీల మోత మోగించాడు. ఆ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ ధావన్ 26పరుగులు మాత్రమే. కానీ, చేధనకు దిగిన భారత్ 31 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

 విరాట్ కోహ్లీ 97

విరాట్ కోహ్లీ 97

329 పరుగులు సాధించిన భారత్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 97 పరుగులు భాగమే. అప్పటికీ బౌలింగ్ విభాగంలో తలపడి హార్దిక్ ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్‌ను కేవలం 161పరుగులకే పరిమితమైంది. ఈ సారి కోహ్లీ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్‌ను ఓడించించేందుకు సహాయపడింది. 203 పరుగుల భారీ ఆధిక్యంతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

విరాట్ కోహ్లీ 123

విరాట్ కోహ్లీ 123

పెర్త్ వేదికగా చెలరేగిన కోహ్లీ.. జట్టు విజయం సాధించకపోయినా మ్యాచ్‌లో మాత్రం తన స్థాయి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. కోహ్లీకి ఇది 25వ టెస్టు సెంచరీ అని సంబరాలు చేసుకున్నంత సమయంలోనే.. కోహ్లీని అవుట్ అంటూ ఆసీస్ క్రికెటర్లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. దీనిపై రివ్యూ కోరిన కోహ్లీకి నిరుత్సాహమే మిగిలింది. దీంతో చాలా మందిలో సందేహాలు నెలకొన్నాయి. నేల మీద పడిన బంతిని క్యాచ్ అందుకున్న ఆసీస్ ఫీల్డర్ గెలుపు సంబరాలు చేసుకుంటుంటే కోహ్లీ అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. ఫలితంగా టీమిండియా 146పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది.

 చతేశ్వర్ పూజారా 132

చతేశ్వర్ పూజారా 132

సౌతాంప్టన్ వేదికగా పూజారా రెచ్చిపోయి ఆడి 132 ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. సౌతాంప్టన్ వేదికగా పరుగులు తీసేందుకు తలపడుతున్న క్రమంలో పూజారా సెంచరీకి మించిన స్కోరు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. పూజారా అన్ని పరుగులు సాధించినప్పటికీ చేధనలో 245 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక 184పరుగులకే చతికిలబడింది.

రిషబ్ పంత్ 114

రిషబ్ పంత్ 114

ఓవల్ వేదికగా రిషబ్ పంత్.. ఇన్నింగ్స్ మరువలేనిది. ఇంగ్లాండ్ జట్టుపై తలపడుతున్న టీమిండియాలో టాప్ ఆర్డర్‌లో మిడిల్ ఆర్డర్‌లో మైదానంలోకి వచ్చాడు పంత్. 464 పరుగుల లక్ష్య చేధనకు ధీటుగా సమాధానమిచ్చే క్రమంలో 114 పరుగులను దూకుడుతో బాదేసి ఇంగ్లాండ్‌కు చురకలంటించాడు ఈ కుర్ర క్రికెటర్. కానీ, భారత్ 118పరుగుల తేడాతో ఓటమికి గురైంది.

చతేశ్వర్ పూజారా

చతేశ్వర్ పూజారా

అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పరుగులు చేసేందుకు కెప్టెన్ కోహ్లీతో సహా అంతా తడబడుతున్న తరుణంలో తానొక్కడై రోజంతా క్రీజులో ఉండిపోయాడు పూజారా. 123పరుగులతో ఇన్నింగ్స్‌ను అదరగొట్టాడు. పూజారా మినహాయించి జట్టులో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ కేవలం రోహిత్ శర్మ(37)మాత్రమే. దీంతో భారత్‌కు 15 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించి 71పరుగులు వరకూ చేశాడు. ఇలా భారత్‌కు ఆసీస్ గడ్డపై తొలి టెస్టు విజయం దక్కింది. దీంతో తొలి టెస్టు తొలిసారి విజయం అందుకున్న రికార్డు సాధించింది.

పృథ్వీ షా 134

పృథ్వీ షా 134

అరంగ్రేట మ్యాచ్‌లోనే ప్రత్యర్థి జట్టుపై ఎదురుదాడికి దిగి అదరగొట్టాడు. వెస్టిండీస్ అంచనాలను అధిగమిస్తూ.. తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీకి మించిన స్కోరును 19 ఫోర్లతో సాధించాడు. భారత్ జట్టుకు భావి స్టార్ క్రికెటర్‌గా అందరిలా కనిపించాడు.

Story first published: Tuesday, December 25, 2018, 15:13 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X