న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Big Bash League : ఫించ్ దంచి కొట్టినా.. అతని నిర్ణయమే కొంప ముంచిందిగా..!

Finch hitting failed to save Renegades

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఆరోన్ ఫించ్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఎడా పెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతనికి చివర్లో విల్ సదర్లాండ్ మంచి సహకారం అందించాడు. అయినా సరే తమ జట్టును మాత్రం వాళ్లు గెలిపించుకోలేకపోయారు. బిగ్ బ్యాష్ లీగ్‌లో రెనగేడ్స్ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రెనగేడ్స్ సారధి ఆరోన్ ఫించ్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఆ నిర్ణయమే ఆ జట్టును బాగా దెబ్బ తీసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ స్కార్చర్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ స్టీఫెన్ ఎస్కినాజి ఎడా పెడా బౌండరీలు బాదేస్తూ కేవలం 29 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కామెరూన్ బాంక్రాఫ్ట్ 50 బంతుల్లో 95 పరుగులతో చివరి వరకూ అజేయంగానే నిలిచాడు. ఆరోన్ హార్డీ (22) కూడా రాణించాడు. చివర్లో కూపర్ కన్నోలీ (20 నాటౌట్) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా సరే పెర్త్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఛేజింగ్‌లో రెనగేడ్స్‌కు అంత గొప్ప ఆరంభం దక్కలేదు. షాన్ మార్ష్ (54) రాణించినా.. మార్టిన్ గప్తిల్ (19 బంతుల్లో 15) జిడ్డు బ్యాటింగ్‌తో విసుగు తెప్పించాడు. శామ్ హార్పర్ (3) కూడా విఫలమయ్యాడు. అయితే కెప్టెన్ ఆరోన్ ఫించ్ (35 బంతుల్లో 76 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి మ్యాట్ క్రిచ్లీ (2) నుంచి సహకారం అందలేదు. కానీ విల్ సదర్లాండ్ (18 బంతుల్లో 30) మంచి మద్దతు ఇచ్చాడు. చివర్లో జాక్ ప్రిస్ట్‌విజ్ (10 నాటౌట్) కూడా రాణించాడు. కానీ నిర్ణీ 20 ఓవర్లలో ఆ జట్టు కేవలం 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రెనగేడ్స్ మరో ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. అద్భుతంగా రాణించిన కామెరూన్ బాంక్రాఫ్ట్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Sunday, January 22, 2023, 20:16 [IST]
Other articles published on Jan 22, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X