న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: టీమిండియా మానసికంగా సిద్దమవుతోంది.. అతనో సూపర్ ప్లేయర్!

 Fielding coach R Sridhar feels team will be ready mentally for the challenge in uk

ముంబై: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మానసికంగా సిద్దమైందని టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ అన్నాడు. ప్రాక్టీస్‌కు సమయం లేకపోవడం పట్ల ఆందోళన లేదని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టులోనూ బలమైన క్రికెటర్లు ఉన్నారని, ఏ మాత్రం తక్కువ అంచనా వేయమని స్పష్టం చేశాడు. కరోనా కట్టడి పోరాటంలో విరాట్‌ కోహ్లీ, హనుమ విహారి, హార్దిక్‌ పాండ్యా సహా క్రికెటర్లు పాలుపంచుకోవడం సంతోషకరమని తెలిపాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీధర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 దిగులుపడాల్సిన పనిలేదు..

దిగులుపడాల్సిన పనిలేదు..

'ప్రాక్టీస్‌కు సమయం లేనందుకు ఆందోళనేమీ లేదు. పూర్తి సన్నద్ధత లేకపోవడం మాకు అనుకూలమే. ఎందుకంటే మా ఆటగాళ్లు మానసికంగా మరింత సిద్దమవుతారు. గాయపడ్డప్పుడు ఎంత అప్రమత్తగా ఉంటారో అలా ఉంటారన్నమాట. అంతేకాకుండా మా క్రికెటర్లు గత కొన్ని నెలల తరబడి క్రికెట్‌ ఆడుతూనే ఉన్నారు. ఐపీఎల్‌ వాయిదా పడటం దురదృష్టకరం. క్వారంటైన్లో కుర్రాళ్లు దేహదారుడ్యం పెంచుకుంటారని, ఫైనల్‌కు తాజాగా సిద్ధమవుతారని కచ్చితంగా చెప్పగలను' అని శ్రీధర్‌ చెప్పుకొచ్చాడు.

ప్రత్యేకమైన కసరత్తులు..

ప్రత్యేకమైన కసరత్తులు..

క్వారంటైన్‌లో ప్రత్యేకమైన కసరత్తులు ఏమైనా చేయిస్తున్నారా? అని ప్రశ్నించగా.. 'మా క్రికెటర్లంతా ప్రొఫెషనల్స్‌. ఏడాదంతా ఫిట్‌గానే ఉంటారు. క్వారంటైన్‌లో వారితో ప్రత్యేకమైన కసరత్తులేమీ చేయించడం లేదు. ఆటగాళ్లకు ఏవి ఎలా పనిచేస్తాయో తెలుసు. అవసరమనిపిస్తేనే జోక్యం చేసుకుంటాను. నేను వాళ్లతోనే ఉంటాను కాబట్టి నా సాయం అవసరమైతే కోరతారు. ఇక ప్రత్యర్థి జట్టులో కొందరిపైనే మేం దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే న్యూజిలాండ్‌ బలమైన జట్టు. తటస్థ వేదిక కాబట్టి వారికీ, మాకూ ఒకేలాంటి అవకాశాలు ఉంటాయి' అని శ్రీధర్‌ తెలిపారు.

 తోచినంతతో సాయం..

తోచినంతతో సాయం..

ఇక డ్యూక్ బాల్స్‌తో గతంలో ప్రాక్టీస్‌తో పాటు మ్యాచ్ ఆడామని, ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం తమ ఆటగాళ్లకుందని చెప్పుకొచ్చాడు. కొవిడ్‌-19 వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని శ్రీధర్‌ అన్నారు. తనకు తోచిన రీతిలో కొవిడ్‌ బాధితులకు సాయం చేస్తున్నానని వెల్లడించారు. కోహ్లీ, విహారి, పాండ్య, ఇంకా మరెంతో మంది క్రికెటర్లు చేయూతనందించడం గర్వకారణమని వెల్లడించారు.

అతను పూర్తిస్థాయి అథ్లెట్

అతను పూర్తిస్థాయి అథ్లెట్

ఇటీవల జట్టులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్ కోసం ఎలాంటి ఫిల్డింగ్ ప్రణాళికలు చేశారని ప్రశ్నించగా.. 'జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చినప్పుడే.. వారి బలాలు, బలహీనతలు మాకు తెలుసుంటాయి. ఇండియా-ఏ, ఐపీఎల్‌లోనే వారిని చూస్తం కనుక.. జాతీయ జట్టుకు అనుగుణంగా వారిని మారుస్తాం. ఓ ఫీల్డింగ్ కోచ్‌గా నేను వారి హ్యాండ్ పవర్, కంటికి, చేతికి మధ్య ఉన్న సమన్వయం, బంతిని ఎంత వేగంగా విసురుతున్నాడని పరిశీలిస్తా. వాటి ఆధారంగా యువ ఆటగాళ్లను ట్రైన్ చేస్తాం. ఇక శుభ్‌మన్ గురించి మాట్లాడితే.. అతను పూర్తిస్థాయి అథ్లెట్. సన్నగా పొడువుగా ఉండే అతను బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ బాగా చేయగలడు'అని శ్రీధర్ తెలిపాడు.

Story first published: Wednesday, June 2, 2021, 15:25 [IST]
Other articles published on Jun 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X