న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'స్వార్థం లేకుండా దేశానికి ఆడావు.. నీ ఆట యువ ఆటగాళ్లకు ఆదర్శం'

Father figure of our team: Tributes pour in for South Africa great Hashim Amla

ముంబై: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆమ్లాకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా శుక్రవారం భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ట్విటర్‌ వేదికగా హషీమ్‌ ఆమ్లాను ప్రశంసించాడు.

'ఫాస్ట్ బౌలర్లు ఒత్తిడికి గురి కాకూడదు.. ఫుల్‌టాస్‌లు వేయొద్దు''ఫాస్ట్ బౌలర్లు ఒత్తిడికి గురి కాకూడదు.. ఫుల్‌టాస్‌లు వేయొద్దు'

'ఏ స్వార్థం ఆశించకుండా దేశానికి ఎంతో సేవ చేసావు. నీ ఆట ఎంతోమంది యువ ఆటగాళ్లకు ఆదర్శం. క్రికెట్ నుండి తప్పుకున్న నీకు మిగిలిన జీవితం అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. గుడ్ లక్ మిత్రమా' అని సచిన్ రాసుకొచ్చారు. అంతకుముందు సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ టెస్టు రిటైర్మెంట్‌పై కూడా సచిన్ స్పందించిన విషయం తెలిసిందే.

'గొప్ప ఆట యొక్క గొప్ప రాయబారులలో ఆమ్లా ఒకరు. దక్షిణాఫ్రికా క్రికెట్ అద్భుతం. అన్నింటిలో నిరూపించుకున్నావు. దేవుడు ఆశీర్వదాలు నీకు ఉంటాయి' అని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి రాసుకొచ్చారు. 'అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్ అవుతానన్న ప్రకటనతో ఆమ్లా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. లెజెండ్, గొప్ప మనిషి, ఆటపై గౌరవం ఉన్న వ్యక్తి. మిగతా జీవితం ఆనందంగా గడవాలని కోరుకుంటున్నా' అని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.

ఇ టీవల ముగిసిన ప్రపంచకప్‌-2019 శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ఆమ్లా కెరీర్‌లో చివరిది. ఇక లంకపైనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమ్లా తన ఆఖరి టెస్టు ఆడాడు. గత కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్న ఆమ్లా.. చివరకు కెరీర్‌ ముగించాలని ప్రపంచకప్‌ సమయంలోనే నిర్ణయించుకున్నాడు. టెస్టుల్లో గత 29 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ప్రపంచకప్‌లో కూడా 7 ఇన్నింగ్స్‌లలో 203 పరుగులే చేసి విఫలమయ్యాడు.

హషీం ఆమ్లా 124 టెస్ట్‌లు, 181 వన్డేలు, 44 అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 46.64 సగటుతో 28 సెంచరీలతో పాటు 4 డబుల్ సెంచరీలు సాధించి 9282 పరుగులు సాధించాడు. వన్డేల్లో 49.46 సగటుతో 27 శతకాలతో 8113, టీ20ల్లో 1277 పరుగులు చేసాడు. టీ20ల్లో అత్యధిక స్కోర్‌ 97.

Story first published: Friday, August 9, 2019, 17:18 [IST]
Other articles published on Aug 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X