ఐపీఎల్ 2019: అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసింది వీళ్లే!

హైదరాబాద్: ఐపీఎల్ 2019వ సీజన్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించాయి. ప్లేఆఫ్ మ్యాచ్‌లు దగ్గర పడినకొద్దీ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. కళ్లు చెదిరే సిక్సర్లు, బౌండరీలతో మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో అనేక రికార్డులు బద్దలవడంతో పాటు అనేక రికార్డులు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే...
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

రిషబ్ పంత్
ఈ సీజన్‌లో రిషబ్ పంత్ అత్యంత వేగంగా హాఫ్ సెంచరీని సాధించాడు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కి 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఆండ్రీ రస్సెల్
ఈ సీజన్‌లో కేకేఆర్‌కు చెందిన ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఐపీఎల్‌లో రెండుసార్లు అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. ఏప్రిల్ 19న బెంగళూరుపై 214 పరుగుల లక్ష్య ఛేదనలో 21 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. అయితే, ఇన్నింగ్స్ చివరి బంతికి పెవిలియన్ చేరడంతో ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమిపాలైంది.

కీరన్ పొలార్డ్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ రెచ్చిపోయి ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగడంతో 197 పరుగులు చేసింది. అనంతరం 63 పరుగులకే 3 వికెట్లు కోల్పయిన దశలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్ ఆకాశమే హద్దుగా ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి జట్టుని గెలిపించాడు.

మొయిన్ అలీ
ఈ సీజన్ ఆరంభంలో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్సీబీ వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఏప్రిల్ 19న జరిగిన మ్యాచ్‌లో మొయిన్ అలీ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ సాధించడంతో ఆర్సీబీ విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications