న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ రికార్డుని సమం చేసిన న్యూజిలాండ్ బౌలర్

Fast bowler Tim Southee equals Sachin Tendulkar’s record of sixes in Test cricket

హైదరాబాద్: న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 69 సిక్సర్లు సాధించడం ద్వారా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టిమ్ సౌథీ ఈ మైలురాయిని అందుకున్నాడు.

<strong>హెల్మెట్‌లో ఇరుకున్న బంతి: బ్యాట్స్‌మన్ వెంట పడ్డ ఫీల్డర్లు (వీడియో)</strong>హెల్మెట్‌లో ఇరుకున్న బంతి: బ్యాట్స్‌మన్ వెంట పడ్డ ఫీల్డర్లు (వీడియో)

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో పదో స్థానంలో క్రీజులోకి వచ్చిన టిమ్ సౌథీ 19 బంతుల్లో 1 సిక్సర్‌ సాయంతో 14 పరుగులు చేశాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో సచిన్‌ కొట్టిన సిక్సర్ల రికార్డును సమం చేశాడు. శ్రీలంక స్పిన్నర్ అకిలా ధనుంజయ బౌలింగ్‌లో టిమ్ సౌథీ ఈ సిక్సుని బాదడం విశేషం.

దీంతో టెస్టు ఫార్మాట్‌లో సచిన్ టెండూల్కర్, టిమ్ సౌథీ ఇద్దరూ సమానంగా 69 సిక్సులు బాదారు. అయితే, సచిన్ టెండూల్కర్ 329 ఇన్నింగ్స్‌ల్లో ఈ సిక్సులు బాదగా... టిమ్ సౌథీ 89 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధింఛడం విశేషం. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో బ్రెండన్‌ మెకల్లమ్‌(107) అగ్రస్థానంలో ఉండగా, గిల్‌ క్రిస్ట్‌(100) రెండో స్థానంలో ఉన్నాడు.

<strong>ఇంటర్వ్యూకు హాజరైన సింగ్, హెసన్‌: టీమిండియా కోచ్ ఎవరో తెలిసేది అప్పుడే!</strong>ఇంటర్వ్యూకు హాజరైన సింగ్, హెసన్‌: టీమిండియా కోచ్ ఎవరో తెలిసేది అప్పుడే!

వీళ్లిద్దరూ 137 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కుని అందుకోవడం విశేషం. మరోవైపు, ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 17వ స్థానంలో ఉండగా, ఇప్పుడు అతని సరసన సౌథీ చేరాడు. వర్షం కారణంగా తొలిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైన న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.

అనంతరం గురువారం రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన శ్రీలంక మరో 46 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ 83.2 ఓవర్లలో 249 పరుగుల వద్ద ముగిసింది. శ్రీలంక స్పిన్నర్ సురంగా లక్మల్‌ నాలుగు వికెట్లు తీశాడు. రాస్‌టేలర్‌(86; 132 బంతుల్లో 6 ఫోర్లు) ఒక్కడే ఆఖరి వరకు పోరాడాడు.

అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి నిరోశా దిక్‌వెల్లా(39; 74 బంతుల్లో ఫోర్), సురంగా లక్మల్‌ (28; 79 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు) క్రీజులో ఉన్నారు.

Story first published: Friday, August 16, 2019, 14:51 [IST]
Other articles published on Aug 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X