న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫాస్ట్ బౌలర్ భువికి డబుల్ ధమాకా: నిన్న మ్యారేజ్ డే.. నేడు గుడ్‌న్యూస్

Fast bowler Bhuvneshwar Kumar has become a father as his wife Nupur Nagar gave birth to a daughter

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు బౌలింగ్ బ్యాక్‌బోన్, ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు తండ్రిగా ప్రమోషన్ లభించింది. అతని భార్య నుపుర్ నగర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఈ ఉదయం నుపుర్ నగర్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవించారు. నవంబర్ 23.. భువనేశ్వర్ కుమార్-నుపుర్ నగర్ పెళ్లి రోజు. ఆ మరుసటి రోజే అతను తండ్రయ్యాడు. ఆ దంపతులకు ఇదే తొలి సంతానం.

టెస్ట్ మ్యాచ్‌లకు..టీ20లకూ తేడా ఉండదా ఇక: ఆ స్పెషలిస్ట్ బ్యాటర్ అరంగేట్రం ఖాయంటెస్ట్ మ్యాచ్‌లకు..టీ20లకూ తేడా ఉండదా ఇక: ఆ స్పెషలిస్ట్ బ్యాటర్ అరంగేట్రం ఖాయం

భువనేశ్వర్ కుమార్ కుటుంబం ఉత్తర ప్రదేశ్‌లోని మీరఠ్‌లో నివాసం ఉంటుంది. అనారోగ్య కారణాలతో అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్ ఈ ఏడాది మే 20వ తేదీన మరణించారు. తల్లి, భార్యతో కలిసి అతను మీరఠ్‌లో నివసిస్తోన్నాడు. 2017 నవంబర్ 23వ తేదీన నుపుర్‌ను వివాహం చేసుకున్నాడు. తొలి సంతానంగా ఆ దంపతులకు ఆడపిల్ల జన్మించింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే భువి తల్లి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మీరఠ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి రాకేష్ గోయెల్ ఆమె వెంట ఉన్నట్లు తెలుస్తోంది.

తల్లీ-బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారని రాకేష్ గోయెల్ చెప్పారు. గురు లేదా శుక్రవారాల్లో నుపుర్ నగర్ డిశ్చార్జ్ అవుతారని అన్నారు. కాగా- టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా తొలి సంతానంగా ఆడబిడ్డే జన్మించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ-బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనూష్క శర్మ దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. భువనేశ్వర్ కుమార్ తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌ను ముగించుకున్నాడు. టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కలేదు.

Story first published: Wednesday, November 24, 2021, 16:35 [IST]
Other articles published on Nov 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X