న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: 'కోహ్లీకి అందమైన సతీమణి అనుష్క.. మేమెందుకు ఆమెను విమర్శిస్తాం'

Farokh Engineer Comes Out in Support of Sunil Gavaskar

ముంబై: భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మల మధ్య తాజాగా మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారం రేపింది. రెండు రోజుల క్రితం గవాస్కర్‌కు మద్దతుగా 'WeSupportGavaskar' అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. మరోవైపు కొందరు మాజీ క్రికెటర్లు కూడా గవాస్కర్‌కు మద్దతుగా నిలిచారు. ఈ వివాదంపై ఇప్పటికే గవాస్కర్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మద్దతుగా నిలవగా.. తాజాగా మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ కూడా అండగా నిలిచారు.

భారతీయులకు హాస్య చతురత తక్కువ:

భారతీయులకు హాస్య చతురత తక్కువ:

సునీల్‌ గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరకరంగా ఏమీ లేదని, ఆయన హాస్యపూరితంగా మాట్లాడాడని ఫరూక్‌ ఇంజినీర్ తెలిపారు. 'భారతీయులకు హాస్య చతురత తక్కువ అనుకుంటా. అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లీల గురించి గవాస్కర్‌ అలా మాట్లాడుంటే.. అది హాస్య స్వరంలోనే ఉంటుంది. అసహ్యకరంగా ఏమీ అనిపించదు. గవాస్కర్‌ గురించి నాకు బాగా తెలుసు. అతడు సరదాగానే మాట్లాడాడని గట్టిగా నమ్ముతున్నా' అని ఫరూక్‌ చెప్పారు.

 వారిని విమర్శించే అవసరం మాకు లేదు:

వారిని విమర్శించే అవసరం మాకు లేదు:

గతంలో అనుష్క శర్మను విమర్శించిన క్రమంలో తనపై కూడా ఇలానే విమర్శలు వచ్చాయని ఫరూక్‌ ఇంజినీర్ అన్నారు. ఆ వివాదాన్ని కూడా రాద్దాంత చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. టీమిండియా సెలక్టర్లను విమర్శించే క్రమంలో అనుష్కకు టీ కప్పులు ఇవ‍్వడానికి వెళ్లారా అంటూ ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. దీనిపై అనుష్క స్పందిస్తూ.. ఫరూక్‌పై మండిపడ్డారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ... 'అనుష్కను నేను, గవాస్కర్‌ ఎందుకు విమర్శిస్తాం. టీమిండియా కెప్టెన్‌ విరాట్కోహ్లీకి అందమైన సతీమణి అనుష్క. వారిని విమర్శించే అవసరం మాకు లేదు. గవాస్కర్‌ ఏదో సరదాగా వ్యాఖ్యానించి ఉంటారు. అంతేకానీ వేరే ఉద్దేశం లేదని నా అభిప్రాయం' అని ఫరూక్‌ చెప్పుకొచ్చారు.

అనుష్క ఫైర్:

అనుష్క ఫైర్:

పంజాబ్‌, బెంగళూరు మ్యాచ్‌కు సునీల్‌ గవాస్కర్ వ్యాఖ్యానం చేశారు. అప్పుడే విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ గురించి ఆయన మాట్లాడారు. 'ఎంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తే.. అంత బాగా మెరుగవుతానని కోహ్లీకి తెలుసు. లాక్‌డౌన్‌ ఉండటంతో అనుష్క బౌలింగ్‌లో మాత్రమే కోహ్లీ సాధన చేశాడు. అలా చేయడం అతనికి ఉపయోగపడలేదని తెలుస్తోంది' అని ఆయన అన్నారు. గవాస్కర్ వ్యాఖ్యలపై కోహ్లీ సతీమణి ఫైర్ అయ్యారు. 'మిస్టర్‌ గవాస్కర్.. మీ వ్యాఖ్య అసహ్యకరంగా ఉంది. భర్త ఆట గురించి భార్యపై నిందలు వేస్తూ అభ్యంతరకరంగా ఎందుకు మాట్లాడారో వివరిస్తే బాగుంటుంది. వ్యాఖ్యానంలో నా పేరును ఉపయోగించడం సందర్భోచితం అనుకున్నారా?. క్రికెట్‌ విషయాల్లోకి నన్ను లాగడం ఎప్పుడు మానుకుంటారు' అని సన్నీ వ్యాఖ్యలపై అనుష్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా ఉద్దేశం అదే:

నా ఉద్దేశం అదే:

అనుష్క విమర్శలపై గవాస్కర్ కూడా స్పందించారు. 'అనుష్కను నేనెక్కడ నిందించాను. ఆమెను అస్సలు నిందించలేదు. విరాట్‌కు అనుష్క బౌలింగ్‌ చేసినట్లు వీడియోలో చూపించారనే చెప్తున్నా. లాక్‌డౌన్‌ సమయంలో కోహ్లీ ఆ మాత్రం బౌలింగే ఆడాడు. భర్తలతో కలిసి భార్యలు కూడా పర్యటనలకు వెళ్లే అంశపై మొదట్నుంచీ మద్దతుగా మాట్లాడుతోంది నేనే. కోహ్లీకి అనుష్క బౌలింగ్‌ చేసిందని అన్నా. బౌలింగ్ అని మాత్రమే అన్నా. మహిళలను కించపరిచే విధంగా ఎక్కడ మాట్లాడాను. లాక్‌డౌన్‌లో విరాట్‌తో సహా ఎవరికీ సరైన ప్రాక్టీస్‌ లేదని చెప్పడమే నా ఉద్దేశం. నా మాటల్ని ఎవరో వక్రీకరిస్తే ఏం చేయగలను' అని అన్నారు.

పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌ను మిస్సవుతున్నారు.. మేం చాలా నష్టపోతున్నాం: అఫ్రిది

Story first published: Monday, September 28, 2020, 10:24 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X