న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ కవర్ పిక్.. ఐసీసీపై పంచ్‌ల వర్షం

Fans trolled ICC: ICC changed Cover Pic After Virat Kohli Record-Breaking 42nd ODI Century

హైదరాబాద్: రికార్డుల రారాజు, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ (120; 125 బంతుల్లో 14×4, 1×6) సాధించాడు. కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 42వ సెంచరీ. ఐదు నెలల సుదీర్ఘ కాలం, 11 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఎట్టకేలకు విండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసాడు. దీంతో సెంచరీ అనంతరం ఎగిరి గంతులేస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు.

<strong>కార్డిఫ్ పురుషుల జట్టు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్</strong>కార్డిఫ్ పురుషుల జట్టు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్

కోహ్లీ రికార్డు సెంచరీ చేయడంతో ఐసీసీకి మళ్ళీ 'కోహ్లీ ఫీవర్' పట్టుకుంది. దీంతో వెంటనే ఐసీసీ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చింది. దీనిపై అభిమానులు ఐసీసీని ట్రోలింగ్ చేస్తున్నారు. 'ఐసీసీ ఎప్పుడూ తటస్థంగా ఉండదు. ఎప్పటికప్పుడూ మారిపోతుంది' అని ఓ అభిమాని ట్వీట్ చేసాడు. ఐసీసీ=బీసీసీఐ=కోహ్లీ అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. ఐసీసీ=ఇండియన్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ=బీసీసీఐ, ఐసీసీ షేమ్ అని ఐసీసీపై పంచ్‌ల వర్షం కురుస్తోంది.

తాజా సెంచరీతో వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌లలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ 18,426 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. అంతేకాదు వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 26 ఏళ్లుగా పాకిస్తాన్‌ దిగ్గజ ఆటగాడు జావేద్‌ మియాందాద్‌ (1930 పరుగులు) పేరున ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

క్రికెట్ బంతుల్లో మైక్రోచిప్‌లు.. బిగ్‌బాష్‌తో ప్రయోగంక్రికెట్ బంతుల్లో మైక్రోచిప్‌లు.. బిగ్‌బాష్‌తో ప్రయోగం

బ్యాట్‌తో విరాట్ కోహ్లీ, బంతితో భువనేశ్వర్‌ కుమార్‌ (4/31) చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. టార్గెట్ ఛేజింగ్‌కు దిగిన విండీస్ భారత బౌలర్ల ధాటికి 42 ఓవర్లలో 210 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్‌ లూయిస్‌ (65; 80బంతుల్లో 8×4, 1×6), నికోలస్ పూరన్‌ (42; 52బంతుల్లో 4×4, 1×6)లు రాణించారు. భారత బౌలరల్లో షమీ (2/39), కుల్దీప్‌(2/59) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.

Story first published: Tuesday, August 13, 2019, 14:19 [IST]
Other articles published on Aug 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X