న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsENG: డీకేకు చోటు దక్కలేదని బాధ పడుతున్న ఫ్యాన్స్

fans sympathize with dinesh karthik after he was not included in playing XI

టీ20 ప్రపంచకప్ ట్రోఫీ ముద్దాడేందుకు రెండు అడుగుల దూరంలో ఉన్న భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌లో తలపడుతోంది. ఈ క్రమంలో జట్టులో పెద్దగా మార్పులేవీ చేయలేదని టీమిండియా సారధి రోహిత్ శర్మ అన్నాడు. అంతకుముందు జింబాబ్వేతో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నట్లు చెప్పాడు.

డీకే స్థానంలో పంత్..

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్థానంలో యువప్లేయర్ రిషభ్ పంత్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ ఆడించింది. పంత్ అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని అందుకే అతన్ని ఆడిస్తున్నామని రోహిత్ చెప్పాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా డీకేను పక్కనపెట్టి పంత్‌నే తీసుకున్నారు. జట్టులో చాలా ట్యాలెంట్ ఉందని, నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉన్నా జింబాబ్వేతో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నామని అన్నాడు.

ప్రపంచకప్‌లో డీకే..

ఈ ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్‌కు పెద్దగా ఆడే అవకాశం దక్కలేదు. పాకిస్తాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో నాలుగు బంతులు మిగిలుండగా క్రీజులోకి వచ్చిన అతను.. ఆ తర్వాత నెదర్లాండ్స్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. సౌతాఫ్రికా మ్యాచ్‌లో సూర్యకుమార్‌కు మంచి సహకారం అందించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. ఇదే విషయంపై మాజీ లెజెండ్ అనిల్ కుంబ్లే మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ.. ఈ టోర్నీలో డీకేకు ఒక్క అవకాశం మాత్రమే దక్కిందన్నాడు.

అభిమానుల సింపతీ..

ఇలా అర్ధంతరంగా డీకేతు తప్పించి పంత్‌ను తీసుకోవడంపై పలువురు అభిమానుఅు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు డీకేలా ఉండటం చాలా కష్టమంటూ అతనిపై సింపతీ చూపిస్తున్నారు. మరికొందరేమో డీకే స్థానంలో పంత్‌ను ఆడించడం ఒక గ్యాంబిల్ అని, అది పనిచేస్తుందో లేదో చెప్పలేమని అన్నారు. పంత్ అభిమానులు సంతోషించినా కూడా.. అతను ఈ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోని సంగతి తెలిసిందే.

Story first published: Thursday, November 10, 2022, 14:54 [IST]
Other articles published on Nov 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X