నిన్నమొన్నటి దాకా టీమిండియా కేవలం ద్వైపాక్షిక సిరీసులు గెలుస్తూ.. ఐసీసీ టోర్నీల్లో చేతులు ఎత్తేస్తోందని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కనీసం బంగ్లాదేశ్‌పై కూడా సిరీస్ గెలవలేకపోయింది. ఇది భారత్‌కు వరుసగా రెండో ద్వైపాక్షిక సిరీస్ ఓటమి. న్యూజిల్యాండ్ చేతిలో కూడా వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని భారత క్రికెట్ అభిమానులు ఎత్తి చూపుతూ సెటైర్లు వేస్తున్నారు. 'మొన్నటి దాకా బైలాటరల్ బుల్లీస్ అన్నారు. ఇప్పుడు అవి కూడా గెలవట్లేదు. హ్యాపీయేనా?' అంటూ వెటకారమాడుతున్నారు.
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో చివరి వికెట్ తీసుకోలేక మ్యాచ్ ఓడిన భారత్.. రెండో వన్డేలో మరోసారి బ్యాటర్లు ఫెయిలవడంతో ఓటమి పాలైంది. 272 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్.. ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. చివర్లో రోహిత్ శర్మ (51 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. అతనికి సహకారం అందించే వాళ్లే కరువయ్యారు. అప్పుడు క్రీజులో ఉన్న మహమ్మద్ సిరాజ్.. తను ఎదుర్కొన్న 47వ ఓవర్‌లో ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చెయ్యకపోవడం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది.
ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న ఫ్యాన్స్.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రిని కూడా గుర్తు చేసుకుంటున్నారు. 'ఏదో కొంచెం ఎక్కువగా మందు కొట్టేవాడు కానీ.. పని కూడా అలాగే చేసేవాడు' అని రవిశాస్త్రిని మెచ్చుకుంటున్నారు. ఎన్నో అంచనాలతో రాహుల్ ద్రావిడ్‌ను టీమిండియా కోచ్‌గా నియమిస్తే.. అతను ఇప్పటి వరకు చెప్పుకోదగిన విజయాలేవీ సాధించలేదు. చివరకు రవిశాస్త్రి హయాంలో చేతుల్లోకి వచ్చిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కూడా ద్రావిడ్ ఆధ్వర్యంలో చివరి టెస్టు ఓడటంతో చేజారిన సంగతి తెలిసిందే.
రెండు మ్యాచుల్లోనూ భారత్ ఓటమిని శాసించిన మెహదీ హసన్‌తోపాటు కనీసం స్కోరు కూడా చెయ్యకపోవగా భారీగా డాట్ బాల్స్ ఆడిన టీమిండియా ప్లేయర్లను కూడా అభిమానులు తిట్టిపోస్తున్నారు. శార్దూల్ ఠాకూర్, సిరాజ్, కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్ తరఫున ఆడారంటూ కామెంట్లు చేస్తున్నారు. చివర్లో రోహిత్ విజయం అందించే వాడని, కానీ సిరాజ్ అతన్ని వెనక్కు లాగేశాడని అంటున్నారు.
#BCCISelectionCommittee #bccipresident #RohitSharma𓃵 #indvsbang #INDvsBAN2ndODI pic.twitter.com/eTR0fDACz6
— Saurav Taragi (@LifevsZindagi) December 7, 2022