న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లోనూ ఒకే ఓవర్లో 18 పరుగులు రాబట్టిన పంత్(వీడియో)

India vs Australia 1st Test : Rishabh Pant 18 Runs In An Over, Fans Gone Crazy | Oneindia Telugu
Fans go bonkers as Rishabh Pant hits Nathan Lyon for 18 in an over

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ హిట్టర్ రిషబ్ పంత్ జోరుగా బ్యాటింగ్ చేశాడు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న రిషబ్ పంత్.. మరోసారి అది టెస్టు ఫార్మాట్ అనే సంగతి మర్చిపోయి అడిలైడ్ వేదికగానూ బౌండరీల మోత మోగించాడు. క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన ఈ యువ వికెట్ కీపర్.. దూకుడు మీద ఆడి ఆ వెంటనే పెవిలియన్ చేరుకున్నాడు.

4,4,4,6, ఔట్

అడిలైడ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో నాలుగో రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్‌లో 16 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్.. 4ఫోర్లు, 1సిక్సు సాయంతో 28 పరుగులు చేశాడు. ఆసీస్ గడ్డపై తొలి సారి మ్యాచ్ ఆడేందుకు ఉపక్రమించిన పంత్.. మూడో వంతు పరుగులు ఒకే ఓవర్‌లో రాబట్టేశాడు. పుజారా (71), విరాట్ కోహ్లి (34), రహానె (70), రోహిత్ శర్మ (1) వికెట్లను పడగొట్టి మంచి ఊపుమీద కనిపించిన స్పిన్నన్ నాథన్ లైన్.. 95వ ఓవర్‌లో మిడ్‌వికెట్‌లో ఫీల్డర్‌ని ఉంచి రిషబ్ పంత్‌ను ఊరిస్తూ బంతులు విసిరాడు.

ఆస్ట్రేలియాకి 323 పరుగుల భారీ లక్ష్యాన్ని

ఆస్ట్రేలియాకి 323 పరుగుల భారీ లక్ష్యాన్ని

కానీ.. క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్లు ఆడిన రిషబ్ పంత్.. ఆ ఓవర్‌లోని చివరి నాలుగు బంతుల్నీ వరుసగా 4, 4, 4, 6 బాదేశాడు. కానీ.. ఆ తర్వాత 97వ ఓవర్‌లో పంత్ కూడా లయన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకి 323 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 307 పరుగులకు ఆలౌటైంది.

నాలుగోరోజు జోడించింది 156 పరుగులే

నాలుగోరోజు జోడించింది 156 పరుగులే

151/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మ్యాచ్‌ ప్రారంభించిన భారత్‌ నాలుగోరోజు 156 పరుగులు జోడించింది. పుజారా(71; 204బంతుల్లో), అజింక్య రహానె(70; 147బంతుల్లో) రాణించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో టీమిండియా 323 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ ముందుంచింది. భోజన విరామ అనంతరం రహానె మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. షమీ, ఇషాంత్‌ డకౌట్‌ కాగా బుమ్రా నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లలో లైన్‌ 6 వికెట్లు తీయగా.. స్టార్క్‌ 3, హేజిల్‌ వుడ్‌ ఒక వికెట్‌ తీశారు.

Story first published: Sunday, December 9, 2018, 17:29 [IST]
Other articles published on Dec 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X