న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvsPAK: కోహ్లీ వర్సెస్ స్టోక్స్.. ఎవరు బెస్ట్ టెస్టు కెప్టెన్?.. నెట్టింట ఇదే చర్చ

Fans draw comparisons between Virat Kohli and Ben Stokes captaincy styles

టెస్టు క్రికెట్ చాలా బోరింగ్.. రోజుల తరబడి కూర్చొని ఆ మ్యాచులు ఎవడు చూస్తాడు? ఇలాంటి ప్రశ్నలు టెస్టు క్రికెట్ చుట్టూ చేరి ఆ ఫార్మాట్ ఇక చచ్చిపోయింది అనుకుంటున్న సమయంలో విరాట్ కోహ్లీ సీన్‌లో ఎంటరయ్యాడు. తనకు మ్యాచులు డ్రా చేసుకోవడం అసలు ఇష్టం లేదని, గెలవడానికే ప్రయత్నిస్తానని పగ్గాలు అందుకున్న వెంటనే ప్రకటించాడు. అలాగే ప్రత్యర్థిని ఆలౌట్ చేయడమే తమ జట్టు లక్ష్యం అని తేల్చేశాడు.

బెస్ట్ కెప్టెన్లలో కోహ్లీ..

బెస్ట్ కెప్టెన్లలో కోహ్లీ..

తను టెస్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోహ్లీ అదే విధానాన్ని అనుసరించాడు. ఫ్లాట్ పిచ్‌లపై కూడా మ్యాచులు గెలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలైన తొలి ఏడాదే టీమిండియాను ఫైనల్ చేర్చాడు. కానీ అప్పటికే అతను ఫామ్ కోల్పోవడం, మిగతా సీనియర్లు కూడా పేలవంగా ఆడటంతో ఆ మ్యాచ్‌లో భారత్ ఓడింది. టెస్టు కెప్టెన్‌గా మొత్తం 68 మ్యాచులు ఆడిన కోహ్లీ.. వాటిలో 40 మ్యాచులు గెలిచి, భారత్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు సారధిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచ దిగ్గజాలు కూడా టెస్టుల్లో అత్యుత్తమ కెప్టెన్లలో కోహ్లీ ఒకడని కితాబిచ్చారు.

స్టోక్స్ పగ్గాలు అందుకున్నాక..

స్టోక్స్ పగ్గాలు అందుకున్నాక..

ఈ ఏడాది ఆరంభంలో టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికాడు. దీంతో మళ్లీ టెస్టు క్రికెట్‌కు గడ్డు రోజులు వచ్చేశాయని అభిమానులు అనుకున్నారు. అయితే బెన్ స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ టెస్టు టీం ఈ స్థానాన్ని భర్తీ చేస్తోంది. టెస్టు కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ రాకతో ఆ జట్టు ఆటతీరే మారిపోయింది. 'బాజ్ బాల్' ఆటతీరు, బెన్ స్టోక్స్ బోల్డ్ నిర్ణయాలతో టెస్టు క్రికెట్‌ను ఇంగ్లండ్ మరింత రసవత్తరంగా మార్చేస్తోంది. స్టోక్స్, మెకల్లమ్ జోడీ ఇంగ్లండ్ టెస్టు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆ జట్టు ఆటతీరే మారిపోయింది. న్యూజిల్యాండ్‌ను స్వదేశంలో క్లీన్ స్వీప్ చేసిన ఆ జట్టు.. భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో కూడా అద్భుతంగా రాణించి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

రావల్పిండిలో బోల్డ్ డెసిషన్..

రావల్పిండిలో బోల్డ్ డెసిషన్..

తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో కూడా చివరి ఇన్నింగ్స్‌ను అనూహ్యంగా డిక్లేర్ చేసిన ఇంగ్లండ్.. అద్భుతమైన పోరాటంతో ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా, స్టోక్స్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్.. ఈ రెండు జట్లలో ఏ టీం ప్రమాదకరంగా కనిపిస్తోంది? అని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో ఇంకా బెన్ స్టోక్స్ తన సత్తా నిరూపించుకోలేదని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. అక్కడ కూడా విజయాలు సాధించే వరకు కోహ్లీతో పోలిక సరికాదని వాదిస్తున్నారు.

Story first published: Tuesday, December 6, 2022, 10:46 [IST]
Other articles published on Dec 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X