న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా క్రికెటర్లకు అభిమాని ఊహించని సర్‌ప్రైజ్‌.. అస్సలు బాగోదన్న రోహిత్‌ (వీడియో)

Fan paid bill for Team India’s lunch in Melbourne

మెల్‌బోర్న్‌: భారత క్రికెట‌ర్లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో వాళ్ల ఆటను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని అభిమానులు క‌ల‌లు కంటారు. కొందరు అయితే అభిమాన క్రికెటర్‌ను కలవడానికి బారికేడ్లు దాటి మైదానంలోకి దూసుకెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటిది వాళ్లు నేరుగా క‌ళ్ల ముందే ప్ర‌త్య‌క్ష‌మైతే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. తాజాగా మెల్‌బోర్న్‌లో ఒక భారత అభిమానికి అచ్చం అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. అయితే ఆ అభిమాని క్రికెటర్‌లకే ఊహించని సర్‌ప్రైజ్‌ ఇవ్వడం ఇక్కడ విశేషం. విషయంలోకి వెళితే...

 రెస్టారెంట్‌కు వెళ్లిన క్రికెటర్లు:

రెస్టారెంట్‌కు వెళ్లిన క్రికెటర్లు:

భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కఠోర సాధన చేస్తూనే కాస్త సమయం దొరికినప్పుడు కంగారూల గడ్డను చుట్టేస్తున్నారు. అయితే కొత్త ఏడాది సందర్భంగా టీమిండియా క్రికెటర్లు రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్‌, శుభ్‌మ‌న్ గిల్, న‌వ్‌దీప్ సైనీ జనవరి 1న మెల్‌బోర్న్‌లోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. తమకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకొని తింటున్నారు. అదే సమయంలో నవల్‌దీప్‌ సింగ్‌ అనే ఓ అభిమాని.. టీమిండియా క్రికెటర్లు కూర్చున్న టేబుల్‌కు ఎదురుగా కూర్చున్నాడు. క్రికెటర్లను చూసి మురిసిపోయిన నవల్‌దీప్‌ ఆటగాళ్లు భోజనం చేస్తున్న సమయంలో వీడియో తీశాడు. ఈ సందర్భంగా వాళ్లకు ఏదైనా సర్‌ప్రైజ్‌ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకోవాలని భావించాడు.

అభిమాని సర్‌ప్రైజ్‌:

అభిమాని సర్‌ప్రైజ్‌:

అనుకోకుండా తనకి వచ్చిన ఈ అవకాశాన్ని నవల్‌దీప్‌ సింగ్ జ్ఞాపకంగా మిగిల్చుకోవాలని మన క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. కౌంటర్ వద్దకు వెళ్లి క్రికెటర్లకు తెలియకుండా 118 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 6700) బిల్లు కట్టాడు. అయితే భోజనం అనంతరం బిల్లు చెల్లించడానికి కౌంటర్ వద్దకు వచ్చిన క్రికెటర్లకు మీ బిల్లును ఆ వ్యక్తి కట్టాడంటూ నవల్‌దీప్ సింగ్ వైపు చూపించారు. దీంతో రోహిత్ శర్మ, పంత్‌లు నవల్‌దీప్‌ వద్దకు వచ్చి డబ్బు ఇవ్వబోయారు. అయితే నవల్‌దీప్‌ అందుకు అభ్యంతరం చెప్పి డబ్బు తీసుకోలేదు. ఆపై అందరూ కలిసి ఓ ఫొటో దిగారు. పంత్‌ ఆ అభిమానిని హగ్‌ చేసుకున్నాడు.

 బాగోదన్న రోహిత్:

బాగోదన్న రోహిత్:

దీనికి సంబంధించిన వీడియో, బిల్లును నవల్‌దీప్‌ సింగ్ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 'నేను బిల్లును చెల్లించినట్లు వాళ్లకి తెలియదు. నా సూపర్‌ స్టార్స్‌ కోసం ఆ మాత్రం చేయలేనా!' అని దానికి వ్యాఖ్య జత చేశాడు. దాన్ని రీట్వీట్ చేస్తూ.. 'బిల్లు కట్టానని తెలుసుకున్న రోహిత్ నా వద్దకు వచ్చి.. ‘బ్రదర్‌.. డబ్బులు తీసుకో. మీరు చెల్లించడం బాగోదు' అని అన్నాడు. ఆ తర్వాత పంత్‌ హగ్‌ చేసుకున్నాడు. అందరం కలిసి ఓ ఫొటో తీసుకున్నాం' అని పోస్ట్‌ చేశాడు. ఈ ట్వీట్, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స‌స్పెన్ష‌నా? జ‌రిమానానా?:

అభిమానికి హగ్‌ ఇచ్చినందుకు రిష‌బ్ పంత్ చిక్కుల్లో ప‌డ్డాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా బ‌యో బుబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించాడ‌ని అతడిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా బ‌యో బ‌బుల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం హగ్ ఇవ్వడం ప్రొటోకాల్ ఉల్లంఘ‌న కిందికే వ‌స్తుంది. క్రికెట‌ర్లు బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌చ్చు, రెస్టారెంట్ల‌లో తిన‌వ‌చ్చు కానీ ఇలా బ‌బుల్‌లో లేని వ్య‌క్తిని తాకడంపై నిషేధం ఉంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు బీసీసీఐ కూడా విచార‌ణ జ‌ర‌ప‌నున్నాయి. బ‌యో బ‌బుల్ ప్రొటోకాల్ ఉల్లంఘ‌న‌ల‌ను ఆయా క్రికెట్ బోర్డులు సీరియ‌స్‌గా తీసుకుంటున్నాయి. గ‌తంలో ఇలాంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన క్రికెట‌ర్ల‌ను స‌స్పెండ్ చేయ‌డ‌మో, జ‌రిమానా విధించ‌డ‌మో చేశాయి.

భారత డ్రెస్సింగ్ రూమ్‌ సూపర్.. కులమతాలతో సంబంధం లేకుండా: అక్తర్‌

Story first published: Saturday, January 2, 2021, 13:34 [IST]
Other articles published on Jan 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X