న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నష్టాల్లో కేరళ బ్లాస్టర్స్: సచిన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా?

Explained: Why Sachin Tendulkar decided to end Kerala Blasters association

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా జరగాల్సిన ఐదో టోర్నమెంట్‌కు సచిన్ టెండూల్కర్ కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సహ యజమానిగా తప్పుకోనున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ సినిమాకు సంబంధించిన ప్రముఖులు మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్‌లతో పాటు ఎన్ ప్రసాద్‌లు మిగిలిన 80శాతం వాటాలు కలిగి ఉన్నారు. దీంతో సచిన్ తన వాటాను అమ్మదలచితే 20శాతాన్ని కొనుగోలు చేసేందుకు చిరంజీవితో పాటుగా తెలుగు వారే సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.

నా హృదయం ఎప్పుడూ స్పందిస్తూనే

నా హృదయం ఎప్పుడూ స్పందిస్తూనే

అమ్మకానికి పెట్టిన తన వాటా గురించి సచిన్ మాట్లాడుతూ.. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫ్రాంచైజీ కేరళ బ్లాస్టర్స్‌కోసం తన హృదయం ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటుందని సచిన్‌ టెండూల్కర్‌ తెలిపాడు. కేరళ బ్లాస్టర్స్‌ సహయజమాని అయిన సచిన్‌ క్లబ్‌లో తన వాటాను అమ్ముకోవడంపై స్పందించాడు. ‘కేరళ బ్లాస్టర్స్‌ ఐదేళ్లుగా నా జీవితంలో భాగమైంది. సహచరులతో మాట్లాడిన తరువాత నా వాటాను అమ్మివేయాలని నిశ్చయించాను. భవిష్యత్తులో మా జట్టు ఇదే ఒరవడిని కొనసాగిస్తుందని భావిస్తున్నాను' అని తెలిపాడు.

లాభాలు తక్కువగా ఉండడంతో సచిన్ బయటికి:

లాభాలు తక్కువగా ఉండడంతో సచిన్ బయటికి:

జట్టులో ఇతర వాటాదారులైన ఐ క్వెస్ట్‌, చిరంజీవి, అల్లు అరవింద్‌.. సచిన్‌ వాటా షేర్లను కొనుగోలు చేయనున్నట్టు కేరళ బ్లాస్టర్‌ యాజమాన్యం వెల్లడించింది. ఇదిలా ఉంచితే ప్రస్తుతం కేరళ బ్లాక్ బ్లాస్టర్స్ నష్టాల్లో నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే లాభాలు తక్కువగా ఉండడంతో సచిన్ జట్టు యాజమాన్యం నుంచి తప్పుకుంటున్నట్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నష్టం విలువ షుమారు రూ.100కోట్లు.

వాటాను కొనుగోలు చేసేందుకు తక్కువ మొత్తానికి

వాటాను కొనుగోలు చేసేందుకు తక్కువ మొత్తానికి

ఇటీవల ఇంగ్లీషు కౌంటీ మిడిల్‌సెక్స్‌తో కలిసి క్రికెట్ క్లబ్‌ను మొదలుపెట్టడంతో సచిన్ టెండూల్కర్ ఈ కేరళ బ్లాస్టర్స్‌తో కొనసాగించలేకపోతున్నారట. 2017 సీజన్‌కు సంబంధించి బ్లాస్టర్స్ నుంచి 15 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లిందట. ఈ కారణంతోనే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న అతని వాటాను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు తక్కువ మొత్తానికి అడుగుతున్నారట. ఈ కారణంతోనే మిగిలిన భాగస్వాములు ప్రస్తుతం ఆ వాటాను తామే ఉంచుకొని కొంతకాలం తర్వాత అమ్మాలని యోచిస్తున్నారట.

మున్ముందు మరింత మెరుగవ్వాలని కోరుకుంటున్నా

మున్ముందు మరింత మెరుగవ్వాలని కోరుకుంటున్నా

భాగస్వామిగా ఉన్నప్పటికీ కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సచిన్ అంబాసిడర్‌గా వ్యవహరించి రూ.కోటి రూపాయలు తీసుకున్నారట. 'మరో ఐదేళ్ల పాటు జట్టుకు మంచి భవిష్యత్ ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంపై మిగిలిన సభ్యులతో చర్చించాను' అని సచిన్ వివరించారు. జట్టు మున్ముందు మరింత మెరుగవ్వాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

Story first published: Monday, September 17, 2018, 16:05 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X