న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ కెప్టెన్సీ కోసం ఎదురుచూస్తున్నా...: షేన్ వాట్సన్

Excited at thought of playing under 'great' Dhoni: Watson

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌వాట్సన్‌ వెల్లడించాడు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) తరపున ఆడబోతుండటాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నాడు.

అలాగే దిగ్గజ ఆటగాడు ధోని నాయకత్వంలో ఆడబోతున్నానన్న ఆలోచన తనను నిలవనీయడం లేదని, ఆ రోజు కోసం ఉత్సాహంతో ఎదురుచూస్తున్నానని అతను తెలిపాడు. 'ఐపీఎల్లో ఘన చరిత్ర కలిగిన సీఎస్కే లాంటి ఫ్రాంఛైజీ తరపున ఆడబోతుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ధోని నాయకత్వంలో ఆడబోతున్నాననే ఆలోచన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది'' అని వాట్సన్‌ చెప్పాడు.

2016, మార్చిలో అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఈ సీనియర్ ఆల్‌రౌండర్.. అనంతరం టీ20 టోర్నీల్లో దూసుకెళ్తున్నాడు. . ఇటీవల ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లోనూ వాట్సన్.. సిడ్నీ థండర్స్ తరఫున మెరుపులు మెరిపించి ఫామ్‌లో ఉన్నాడు.

బెంగళూరు వేదికగా జనవరి 27, 28న జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ షేన్ వాట్సన్‌ని రూ. 4 కోట్లకి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి 2015 వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ప్రాతినిథ్యం వహించిన వాట్సన్.. గత రెండు సీజన్లలోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు.

వాట్సన్‌ ఐపీఎల్లో 2008 నుంచి 2015 వరకు రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున, గత రెండు సీజన్లలో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ తరపున ఆడాడు. ఈ జనవరిలో నిర్వహించిన వేలంలో వాట్సన్‌ను సీఎస్కే సొంతం చేసుకుంది. నిషేధం కారణంగా 2016, 2017 ఐపీఎల్ సీజన్లకి దూరమైన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది మళ్లీ పునరాగమనం చేస్తున్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 11:12 [IST]
Other articles published on Feb 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X