న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా అండర్-19 ప్లేయర్.. యూఎస్ కెప్టెన్ అయ్యాడు!!

Ex-India U-19 star. Software engineer. US cricket captain

శాన్‌ఫ్రాన్సిస్‌స్కో: సౌరభ్ నేత్రవాల్కర్.. ఒకప్పుడే భారత క్రికెటర్.. ఇప్పుడు యుఎస్ కెప్టెన్. 2015లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి కఠోర శ్రమతో అక్కడి జట్టుకు కెప్టెన్ అయ్యాడు. 2010 అండర్19 ప్రపంచకప్‌లో భారత మీడియం పేసర్‌గా రాణించాడు. భారత్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ముంబై తరఫున రంజీ మ్యాచ్ కూడా ఆడాడు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో స్థిరపడ్డా

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో స్థిరపడ్డా

చదువులోనూ మేటి.. ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కానీ ఆ తర్వాతి దశకు చేరతానో లేదో అనే అనుమానంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికి మాస్టర్స్‌ చదవడానికి అమెరికా విమానం ఎక్కాడు. అంతే టోఫెల్ రాసి అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అయినా మనోడిలోని క్రికెటర్ అతన్ని సంతృప్తి చెందనీయలేదు.

అత్యధిక వికెట్ల సాధించిన బౌలర్‌గా

అత్యధిక వికెట్ల సాధించిన బౌలర్‌గా

క్రికెట్‌పై అతని ఇష్టం అతన్ని మళ్లీ మైదానంవైపు నడిపించింది. అంతే కొంతకాలానికి అమెరికా జాతీయ జట్టుకు ఎంపికవడమే కాదు. ఇప్పుడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. .27 ఏండ్ల సౌరభ్ ఆరడుగుల ఎడమచేతివాటం పేసర్. 2010 అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆడిన ఏకైక రంజీమ్యాచ్‌లో మూడు వికెట్లతో రాణించాడు.

అమెజాన్‌ వారియర్స్‌ జట్టుకు ఎంపికైన సౌరభ్‌

అమెజాన్‌ వారియర్స్‌ జట్టుకు ఎంపికైన సౌరభ్‌

భారత్‌లో ఉంటే క్రికెట్‌లో అవకాశాలు రావని ..అమెరికా చేరి వారాంతాల్లో క్రికెట్ ఆడుతూ అమెరికా జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. గతంలోనూ మహారాష్ట్రకు చెందిన సుశీల్, హైదరాబాద్ మాజీ క్రికెటర్ ఇబ్రహీం ఖలీల్ కూడా అమెరికా జాతీయజట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్టుకు ఎంపికైన సౌరభ్‌కు మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు.

 తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యా

తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యా

‘భారత్‌లో పూర్తిగా రెండేళ్ల పాటు క్రికెట్‌కు కేటాయించా. కానీ తర్వాతి దశకు చేరుతాననే నమ్మకాన్ని కోల్పోయా. దాంతో మాస్టర్స్‌ కోసం యుఎస్‌ వచ్చేశా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా క్రికెట్‌ ఆడడం మానలేదు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరినా కూడా వారాంతాల్లో మ్యాచ్‌లు ఆడేవాణ్ని. చివరకు నా శ్రమ ఫలించి గత జనవరిలో తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యా. వచ్చే వారం ఒమన్‌లో 2023 వన్డే ప్రపంచకప్‌ అర్హతా టోర్నీ అయిన ఐసీసీ ప్రపంచ క్రికెట్‌ లీగ్‌ డివిజన్‌ 3 టోర్నీలో జట్టును ముందుండి నడిపించబోతున్నా' అని సౌరభ్‌ చెప్పాడు.

Story first published: Monday, November 5, 2018, 12:44 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X