Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌

 KKR appoint Brendon McCullum as coach

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కొత్త ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ నియమితులయ్యారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ స్థానాన్ని అతడితో భర్తీ చేయనున్నట్లు కేకేఆర్ యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది.

2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మెకల్లమ్.. ఇటీవలే అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. మొదటి నుంచీ నైట్‌రైడర్స్‌ జట్టుతో కల్లమ్‌కు అనుబంధం ఉంది. మెక్‌కల్లమ్‌ను ఆరంభ సీజన్‌లో కేకేఆర్ వేలంలో సొంతం చేసుకుంది. దీంతో కేకేఆర్ ఆడిన తొలి మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఆ తర్వాత ఐదు సీజన్ల పాటు కేకేఆర్ జట్టుకే మెక్‌కల్లమ్ ఆడాడు. 2012 విజేతగా నిలిచిన కోల్‌కతా జట్టులోనూ మెక్‌కల్లమ్‌ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌తో పాటు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోని నైట్‌రైడర్స్‌కే చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టులోనూ భాగస్వామిగా ఉన్నాడు. ఈ రెండు జట్లకూ బ్రెండనే కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

కాగా, మెక్‌కలమ్‌ 101 టెస్టుల్లో 6,453 పరుగులు చేయగా అత్యధిక స్కోరు 302 కావడం విశేషం. కివీస్ తరుపున మొత్తం 260 వన్డేల్లో 6083 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కోచ్‌గా నియమితులైన సందర్భంగా మెక్‌ కల్లమ్‌ మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలు అప్పగించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా అని తెలిపాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్లలో అత్యున్నత క్రీడాకారులు ఉన్నారని, వారి సహకారంతో ఉన్నత జట్లుగా తీర్చిదిద్దుతానని చెప్పాడు. చాలా రోజుల తర్వాత నైట్‌ రైడర్స్‌ కుటుంబంలో మెక్‌కల్లమ్‌ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సీఈఓ వెంకీ మైసూర్‌ తెలిపారు.

Story first published: Thursday, August 15, 2019, 20:58 [IST]
Other articles published on Aug 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+