Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మతో కలిసి బుమ్రా, కోహ్లీని ఇమిటేట్ చేసిన జడేజా(వీడియో)

IND V WI 2019 : Jadeja Hilariously Imitates Kohli, Bumrah In 'Heads Up Challenge' With Rohit Sharma
Ravindra Jadeja hilariously imitates Kohli, Bumrah in Heads Up Challenge with Rohit Sharma

హైదరాబాద్: కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యనటలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీవ్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరిస్‌పై కన్నేసింది.

అయితే, గుయానా వేదికగా గురువారం జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన తొలి వన్డేను తొలుత అంపైర్లు 43 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ ఓడిన వెస్టిండిస్ జట్టు బ్యాటింగ్‌ను ఆరంభించింది. ఆ తర్వాత మరోమారు వర్షం కురవడంతో మ్యాచ్‌ను అంఫైర్లు 34 ఓవర్లకు కుదించారు.

13 ఓవర్ల పాటు ఆట సజావుగా

13 ఓవర్ల పాటు ఆట సజావుగా

అయితే, ఇందులో కూడా 13 ఓవర్ల పాటు ఆట సజావుగా సాగింది. అయితే, వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగించిన సమయంలో జట్టు సభ్యులంతా సరదాగా ఆట పాటలతో కాలక్షేపం చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ-రవీంద్ర జడేజా సరదా గేమ్ ఆడారు. రోహిత్ ఓ బోర్డు పట్టుకుని పేరు చూపిస్తే దానిని యాక్టింగ్ ద్వారా జడేజా చేసి చూపించాలి.

20 ఏళ్ల తర్వాత కూడా కోహ్లీ-రోహిత్‌ విబేధాలపై స్టోరీలు ఆగవు

తొలుత బుమ్రా పేరు రావడంతో

తొలుత బుమ్రా పేరు రావడంతో

ఇందులో భాగంగా తొలుత బుమ్రా పేరు రావడంతో జడేజా... బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను చేసి చూపించాడు. రోహిత్ శర్మ ఠక్కున బుమ్రా పేరు చెప్పడంతో రెండో బోర్డులో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు వచ్చింది. ఇండియన్ బ్యాట్స్‌మన్ అని చెప్పి కోహ్లీ మణికట్టు దగ్గర బ్యాట్ సర్దుకునే స్టైల్ చూపించడంతో వెంటనే రోహిత్.. కోహ్లీ అంటూ గట్టిగా అరిచాడు.

కోహ్లీ సైతం వీరిద్దరి సరదా ఆటను చూసి

జడేజా యాక్టింగ్‌కు రోహిత్ శర్మ వెంటనే చెప్పేయడంతో ఇద్దరూ ఆనందంలో ఎగిరి గంతులేశారు. మరోవైపు ఆ పక్కనే ఉన్న కోహ్లీ సైతం వీరిద్దరి సరదా ఆటను చూసి తాను కూడా నవ్వుకున్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. జడేజా నుంచి రోహిత్ శర్మ హెడ్స్ అప్ ఛాలెంజ్ తీసుకున్నాడు అంటూ పోస్టు చేసింది.

India vs West Indies: లారా రికార్డు బద్దలు, చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్

ఆదివారం రెండో వన్డే

ఆదివారం రెండో వన్డే

ఇదిలా ఉంటే, మూడు వన్డేల సిరిస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డే ఆగష్టు 11(ఆదివారం)నాడు జరగనుంది. దీంతో ఈ సిరిస్‌లో మిగతా రెండు వన్డేలు కీలంక కానున్నాయి. వన్డే సిరిస్ అనంతరం టీమిండియా 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

Story first published: Friday, August 9, 2019, 18:29 [IST]
Other articles published on Aug 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+