న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ 20 ఏళ్ల కుర్రాడేం కాదు.. ఆశించడం మానేయండి'

MS Dhoni To Play Like A 20-Year-Old : Everyone Still Expects | Oneindia Telugu
Everyone Should Understand That MS Dhoni Is Not 20 Years Old Anymore, Says Kapil Dev

హైదరాబాద్: ధోనీ ఫామ్ తగ్గిపోయిందంటూ.. టీమిండియాలో చోటు దక్కించుకోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోనీ ఫామ్ తగ్గిపోయిందంటున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్ స్పందించారు. ధోనీ ఫామ్‌లో లేకపోవడానికి అతనేం 20ఏళ్లు లేదా 25ఏళ్ల కుర్రోడు కాదంటూ ధోనికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుత క్రికెట్ గురించి ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ ఇలా మాట్లాడారు.

ఆటను ఆశించడం ముమ్మాటికి తప్పే.

ఆటను ఆశించడం ముమ్మాటికి తప్పే.

‘మహేంద్రసింగ్‌ ధోనీ గురించి అందరూ ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. ధోనీ 20 లేదా 25 ఏళ్ల కుర్రోడు కాదని సంగతి గుర్తుంచుకోండి. అలాంటి వయస్సున్నప్పుడు ధోనీ దూకుడు అంతా చూశాం. ఆయన నెలకొల్పిన రికార్డులు అందరికి తెలిసినవే. ఈ వయస్సులో కూడా అతని నుంచి అదే ఆటను ఆశించడం ముమ్మాటికి తప్పే. అతనికి ఆపారమైన అనుభవం ఉంది. ఆ అనుభవమే టీమిండియాకు సాయపడుతుంది.'

క్వార్టర్స్‌లోకి మేరీ కోమ్.. ఆరో స్వర్ణంపైనే ఆశలన్నీ..

టీమిండియా అత్యంత విలువైన ఆస్తి.

టీమిండియా అత్యంత విలువైన ఆస్తి.

'ధోనీ టీమిండియాకు దొరికిన అత్యంత విలువైన ఆస్తి. మైదానంలో అతను చూపించే సమయస్ఫూర్తి అమోఘం. కెప్టెన్‌గా ఉన్నప్పుడు క్లిష్ట సమయాల్లో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుని జట్టును విజయాల బాటలో నడిపించారు. ధోనీ.. టీమిండియాలో మరిన్ని మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నాను' అని తెలిపాడు. ప్రస్తుతం టీమిండియాలో మంచి ప్లేయర్లున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం విదేశాల్లో సైతం టీమిండియా సులభంగా నెగ్గుకురాగలదని అభిప్రాయపడ్డారు.

టాలెంట్, కష్టపడే వ్యక్తులు సూపర్ మాన్‌గా

టాలెంట్, కష్టపడే వ్యక్తులు సూపర్ మాన్‌గా

ప్రస్తుత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ గురించి మాట్లాడుతూ ‘టాలెంట్‌, అనుభవం కూడా తోడైతేనే విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించే ప్రత్యేకమైన వ్యక్తుల్లో కోహ్లీ ఒకడు. ప్రత్యేకమైన ఆటగాడు కూడా. ప్రతిభ, కష్టపడి ఆడే స్వభావం అతడి నైజం. ఇలా టాలెంట్, కష్టపడే స్వభావం ఉన్న వ్యక్తులు సూపర్ మాన్‌గా తయారవుతారు. అతనిలోని క్రమశిక్షణ, నైపుణ్యమే అతనిని ఈ స్థానంలో నిలబెట్టింది.'

ఓడిపోయినా పెద్ద సమస్య కాదు

ఓడిపోయినా పెద్ద సమస్య కాదు

కోహ్లీ సేన ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. నవంబర్‌ 21న తొలి టీ20 బ్రిస్బేన్‌లో జరగనుంది. 'ఐసీసీ వరల్డ్ మహిళా టీ20 ఆడుతోన్న హర్మన్ ప్రీత్ సేన సెమీస్‌లోకి దూసుకెళ్లింది. వారు గెలవగలం అనే దృక్ఫథం ముందుకెళ్తే కచ్చితంగా గెలిచితీరుతాం. అలా కాకుండా ఓడిపోయినా పెద్ద సమస్య కాదు. మ్యాచ్‌లు గెలవడం, ఓడిపోవడం అనేది విషయం కాదు. మ్యాచ్‌ ఎలా ఆడారనేది ముఖ్యం' అని ఆన్నారు.

Story first published: Monday, November 19, 2018, 18:03 [IST]
Other articles published on Nov 19, 2018
Read in English: Kapil Dev backs MS Dhoni
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X