For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్వార్టర్స్‌లోకి మేరీ కోమ్.. ఆరో స్వర్ణంపైనే ఆశలన్నీ..

Women’s World Boxing Championships: Mary Kom, Manisha Maun enter quarters; Sarita Devi bows out

న్యూ ఢిల్లీ: ఏఐబీఏ ప్రపంచ మహిళల ఛాంపియన్‌షిప్‌లో ఆదివారం కూడా భారత బాక్సర్లకు బాగానే కలిసొచ్చింది. మాజీ ఛాంపియన్‌ మేరీ కోమ్‌ సహా నలుగురు బాక్సర్లు క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. స్వర్ణంపై గురిపెట్టిన దిగ్గజ క్రీడాకారిణి మేరీకోమ్‌.. 48 కిలోల విభాగంలో సునాయాసంగా ప్రిక్వార్టర్స్‌ దాటింది. 35 ఏళ్ల మేరీ ప్రిక్వార్టర్స్‌లో 5-0తో కేటీ టేలర్‌ (ఐర్లాండ్‌)పై ఘనవిజయం సాధించింది. కచ్చితంగా పతకం గెలుస్తుందన్న అంచనాల మధ్య పోటీకి దిగిన మేరి ఆ దిశగా అలవోక విజయాన్నందుకుంది.

ఈసారి కూడా పసిడి నెగ్గుతానని ఆశాభావం

ఈసారి కూడా పసిడి నెగ్గుతానని ఆశాభావం

ఆదివారం జరిగిన 48కిలోల బౌట్‌లో ఈ మణిపూర్ దిగ్గజ బాక్సర్ 5-0 తేడాతో ఐజెరిమ్‌మ కెసెన్‌యెవా(కజకిస్థాన్)ను చిత్తుచిత్తుగా ఓడించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలి ప్రయత్నంలోనే రజతం గెలిచిన మేరీ.. ఆ తర్వాత 5 స్వర్ణాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఈసారి కూడా పసిడి నెగ్గుతానని ఆమె ఆశాభావం వ్యక్తంచేసింది. మరోవైపు యువ బాక్సర్‌ మనీషా మౌన్‌ టోర్నీలో సంచలన విజయం సాధించింది.

20 ఏళ్ల హర్యానా బాక్సర్ ప్రత్యర్థిని అలవోకగా

20 ఏళ్ల హర్యానా బాక్సర్ ప్రత్యర్థిని అలవోకగా

తొలుత జరిగిన 54కిలోల బౌట్‌లో మనీషా మౌన్ 5-0తో మాజీ ప్రపంచ చాంపియన్ రజత పతక విజేత దినా జాహల్‌మన్(కజకిస్థాన్)పై అలవోక విజయం సాధించింది. బరిలోకి దిగిన తొలి ప్రపంచ టోర్నీలోనే తనదైన ప్రతిభ కనబరుస్తూ ఈ 20 ఏళ్ల హర్యానా బాక్సర్ ప్రత్యర్థిని అలవోకగా ఓడించింది. క్వార్టర్స్‌లో స్టోక్యా పెట్రోవా(బల్గేరియా)తో మనీషా తలపడుతుంది. మరో విజయం సాధిస్తే.. మనీషాకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలి పతకం ఖరారవుతుంది.

కోహ్లీని జాగ్రత్తగా ఉండమని ఆదేశించడమా.. అది అబద్ధం: బీసీసీఐ

సరితా దేవికి చేదు అనుభవం

సరితా దేవికి చేదు అనుభవం

69 కేజీల విభాగంలో లావ్లినా, 81 కేజీల్లో కచారి భాగ్యవతి కూడా క్వార్టర్స్‌ చేరారు. లావ్లినా 5-0తో, భాగ్యవతి 4-1తో తమ ప్రత్యర్థులపై గెలిచారు. మరోవైపు సీనియర్‌ బాక్సర్‌ సరితా దేవికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె వివాదాస్పద రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆమె 60 కేజీల ప్రిక్వార్టర్స్‌లో 2-3తో కెల్లీ హారింగ్టన్‌ (ఐర్లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది. సరిత, హారింగ్టన్ మధ్య పోరు ఆఖరి వరకు హోరాహోరీగా సాగింది.

ఎడమచేతి వాటం కావడంతో పడిపోయా:

ఎడమచేతి వాటం కావడంతో పడిపోయా:

ఒకరిపై ఒకరు మెరుపు పంచ్‌లతో విరుచుకుపడ్డారు. అయితే చివరకు ఐర్లాండ్ బాక్సర్‌ను రిఫరీలు విజేతగా నిర్ణయించడంతో సరిత ఒక్కసారిగా షాక్‌కు గురైంది. 'మూడు రౌండ్లలో ప్రత్యర్థిపై నేనే ఆధిపత్యం ప్రదర్శించాను అనుకున్నా. కానీ ఐర్లాండ్ బాక్సర్ ఎడమచేతి వాటం కావడంతో రింగ్‌లో కిందపడిపోయాను' అని సరిత నిర్వేదం వ్యక్తం చేసింది.

Story first published: Monday, November 19, 2018, 11:02 [IST]
Other articles published on Nov 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+