న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రతిసారీ దాని వల్లే ప్రాబ్లమవుతుంది.. ఇండియా వుమెన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వ్యాఖ్యలు

Every Time In The Finals Of Big Tourneys We Are Facing the Same Problem Says Harman

కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచులో గెలుపు అంచుల్లో భారత వుమెన్స్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఇక భారత మహిళల క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఫైనల్స్‌లో బ్యాటింగ్‌ విషయంలో జట్టు చేసిన తప్పులను ఖండించింది. 162పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9పరుగుల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. తద్వారా ఆస్ట్రేలియా పోడియంపైనా గోల్డ్ మెడల్ అందుకోగా.. భారత్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత కొన్నేళ్లలో భారత్ మెగా టోర్నీ ఫైనల్‌లో ఓడిపోవడం ఇది మూడోసారి. చాలాసార్లు మెగా టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్‌ల్లో సేమ్ తప్పిదాలు చేశామని కౌర్ చెప్పింది. తప్పులు పునరావృతం చేయడం మానేయాలని తద్వారా జట్టు మెరుగుపడాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

మైండ్ ఎక్కడో బ్లాక్ అవుతుంది..

మైండ్ ఎక్కడో బ్లాక్ అవుతుంది..

‘బిగ్ టోర్నీ ఫైనల్స్‌లో ప్రతిసారీ మేము బ్యాటింగ్లో ఒకే రీతిలో తప్పులు చేశాము, అది మేం మెరుగుపరుచుకోవాలి. మేము లీగ్ దశలో లేదా ద్వైపాక్షిక సిరీస్లలో ఈ తప్పులు చేయం. కానీ ఎందుకో ఫైనల్ లాంటి మ్యాచుల్లో మాత్రం ఈ తప్పులు చేసేస్తున్నాం. ఫైనల్ మ్యాచ్ ప్రెషర్ మా మైండ్‌ని ఎక్కడో బ్లాక్ చేస్తోంది. దాని వల్లే ప్రాబ్లమ్ అవుతుంది. ' అని కౌర్ వెల్లడించింది. ఇకపోతే చివరి ఆరు ఓవర్లలో భారత్‌కు 50పరుగులు అవసరమైన దశలో టీమిండియా గెలుపు ఖాయమనిపించేలా కన్పించింది. ఆ తర్వాత 13పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ తీవ్ర కష్టాల్లో పడింది. తద్వారా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. జట్టులో మరో నిఖార్సైన బ్యాటర్‌ అవసరముందని హర్మన్ అభిప్రాయపడింది.

ఫలించిన హార్దిక్ ప్రయోగాలు, ఇండియా ఘనవిజయం *Cricket | Telugu OneIndia
 మరో నిఖార్సైన బ్యాటర్ కోసం చూస్తున్నాం

మరో నిఖార్సైన బ్యాటర్ కోసం చూస్తున్నాం

‘మేము ఇప్పుడు జట్టులో మరో నిఖార్సైన బ్యాటర్ కోసం చూస్తున్నాం. దురదృష్టవశాత్తూ మేము ఇంకా ఆ వెలితిని కొనసాగిస్తూనే ఉన్నాం. మేము మరో అదనపు బ్యాటర్‌ను కలిగి ఉంటే.. వికెట్లు కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటాం. ఫైనల్లో తొలుత రెండు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత.. జెమిమా రోడ్రిగ్స్ మరియు నేను కలిసి ఇద్దరం నెలకొల్పిన భాగస్వామ్యం జట్టుకు ఎంతో అవసరం. ఆ టైంలో బ్యాటింగ్ చేయాలంటే నరాలు తెగే ఉత్కంఠను అధిగమించి ఆడాలి. అయినా మేము గెలుపు బాటలోకి వచ్చేశాం. బహుశా పూజా వస్త్రాకర్ లేదా నేను చివర వరకంటూ ఉండుంటే మేము గేమ్‌ను గెలుస్తాం. కానీ అది జరగలేదు. ఏదేమైనా గేమ్‌లో ఇలాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు మనం కొన్ని విషయాలను కంట్రోల్ చేయలేము. ఇది మాకు గొప్ప లెస్సన్' అని కౌర్ చెప్పింది.

అయినా సంతోషంగానే ఉంది

అయినా సంతోషంగానే ఉంది

మ్యాచ్ ఓడిపోయి గోల్డ్ మిస్సయినప్పటికీ.. జట్టు ప్రదర్శన పట్ల కౌర్ సంతోషం వ్యక్తం చేసింది. తాము రజత పతకం సాధించడం తరువాతి తరం క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘మేము స్వర్ణం గెలవడానికి దగ్గరగా వచ్చామని మాకు తెలుసు.. ఏదేమైనా కామన్ వెల్త్ గేమ్స్‌లో మా ప్రదర్శన చాలా బాగుంది. మేము ఈ టోర్నమెంట్‌లో ఆడటం ఇదే మొదటిసారి. తొలిసారి టోర్నీలో మేము రజత పతకాన్ని గెలుచుకున్నందుకు సంతోషంగా ఉన్నాం. ఇంత పెద్ద ఈవెంట్లో పతకంతో తిరిగి స్వదేశానికి వెళ్లడం కొంత ప్రేరణాత్మకంగా ఉంటుంది. ఒక జట్టుగా మేము తర్వాతి తరం అమ్మాయిలకు ప్రేరణ కల్పించాలనుకుంటున్నాం.' అని కౌర్ చెప్పింది.

Story first published: Monday, August 8, 2022, 14:55 [IST]
Other articles published on Aug 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X