న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ 80 ఏళ్లకి వీల్ చైర్‌లో కూర్చున్నా.. నా జట్టే'

Even If He Is 80 Years Old, Or On A Wheelchair, MS Dhoni Will Always Be A Part Of My All-time XI, Reveals AB De Villiers

హైదరాబాద్: కీపింగ్‌లో చురుకుగా వ్యవహరించడంలో మహేంద్ర సింగ్ ధోనీ దిట్ట. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. పరుగుల వరద పారించడంలోనూ మ్యాచ్‌కు చక్కని ముగింపునివ్వడంలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తాడు. అయితే కొన్నాళ్లుగా ధోనీ తన కెరీర్‌లో అత్యంత పేలవమైన ఆటతీరును కొనసాగిస్తున్నాడు. కొన్నేళ్ల పాటుగా భారత మిడిలార్డర్‌కు వెన్నెముకగా నిలిచాడు.

9 మ్యాచ్‌లలో 156 పరుగులు మాత్రమే

9 మ్యాచ్‌లలో 156 పరుగులు మాత్రమే

అంతేగాక, కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. విరాట్ కోహ్లికి అవకాశం ఇవ్వడం కోసం ధోనీ కెప్టెన్సీ పగ్గాలను వదిలేశాడు. వయసు ప్రభావంతో మహీ గతంలో మాదిరిగా భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 156 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వచ్చే ప్రపంచ కప్‌లో ధోనీ స్థానంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

మైదానంలో వ్యూహాలు రూపొందించడంలో

మైదానంలో వ్యూహాలు రూపొందించడంలో

బ్యాటింగ్‌లో మహీ సత్తా చాటుతుండకపోవచ్చు. కానీ మైదానంలో వ్యూహాలు రూపొందించడంలో మాత్రం ఇప్పటికీ అతడి తర్వాతే ఎవరైనా. వికెట్ల వెనుకాల అతడిలో చురుకుదనం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. జట్టులో అతడు ఉన్నాడంటే ఇతర ఆటగాళ్లకు భరోసా. ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలికే తరుణం ఆసన్నమైందా అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ను అడగ్గా.. ఏబీ తనదైన శైలిలో బదులిచ్చాడు.

ఆటగాణ్ని తప్పించాలని ఎప్పటికీ అలా:

ఆటగాణ్ని తప్పించాలని ఎప్పటికీ అలా:

‘ధోనీకి 80 ఏళ్లు వచ్చినా.. నా ఆల్ టైం డ్రీం ఎలెవన్‌లో స్థానం కల్పిస్తా. వీల్‌చైర్లో ఉన్న ధోనీ నా జట్టు తరఫున బరిలో దిగుతాడు. అతడు అద్భుతమైన ఆటగాడు, ఓసారి ధోనీ రికార్డులను చూడండి. అలాంటి ఆటగాణ్ని తప్పించాలని అనుకుంటారా? నేనైతే ఎప్పటికీ ఆ పని చేయన'ని డివిలియర్స్ చెప్పాడు.

ప్రపంచ కప్‌లో ఆడేందుకు ధోనీ కష్టపడాలని

ప్రపంచ కప్‌లో ఆడేందుకు ధోనీ కష్టపడాలని

మరో పక్క భారత జట్టులో తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణంలో ప్రపంచ కప్‌లో ఆడేందుకు ధోనీ కష్టపడాలని సౌరవ్ గంగూలీ సూచిస్తున్నాడు. ధోనీకి విండీస్‌తో జరుగుతున్న ఈ వన్డే సిరీస్ చాలా కీలకం. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ప్రదర్శన ఆధారంగానే అతను జట్టులో కొనసాగుతాడంటూ పేర్కొన్నాడు.

Story first published: Monday, October 22, 2018, 16:54 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X