న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

57 బంతుల్లో సెంచరీ: ప్రపంచకప్‌లో ఇయాన్ మోర్గాన్ అరుదైన రికార్డు

Eoin Morgan Smashes A 57 Ball Century Against Afghanistan; Fourth-fastest Century in World Cup History

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఆప్ఘనిస్థాన్ బౌలర్లకు చుక్కులు చూపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

43వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు

రషీద్ ఖాన్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాది కేవలం 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో మోర్గాన్‌కి ఇది 13వ సెంచరీ. ఈ క్రమంలో మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

వన్డేల్లో 200 సిక్సర్ల మైలురాయిని

దీంతో పాటు ఈ మ్యాచ్‌లో మోర్గాన్ వన్డేల్లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఫోర్లు, సిక్సులు బాదుతూ ఆప్ఘన్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మోర్గాన్ సిక్సుల వర్షానికి ఆప్ఘన్ బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు.

ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ

ఈ మ్యాచ్‌లో సెంచరీతో వన్డేల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఒక ఎండ్‌లో మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే... మరో ఎండ్‌లో జో రూట్ నెమ్మదిగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరి జోడీ మూడో వికెట్‌కు 100కు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

45 ఓవర్లకు 323 పరుగులు చేసిన ఇంగ్లాండ్

ప్రస్తుతం 45 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ రెండు వికెట్లు నష్టానికి 323 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్(118), జో రూట్(83) పరుగులతో క్రీజులో ఉన్నారు.

1
43667
Story first published: Tuesday, June 18, 2019, 18:23 [IST]
Other articles published on Jun 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X