న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvsAUS: చెలరేగిన ఆర్చర్, కరన్.. 207 పరుగులకి ఆస్ట్రేలియా ఆలౌట్.. లెక్కసరిచేసిన ఇంగ్లండ్

ENGvsAUS: Chris Woakes, Jofra Archer stars England beat Australia, Level Series


మాంచెస్టర్:
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ పేసర్లు క్రిస్‌ వోక్స్, జోప్రా ఆర్చర్, శామ్ కరన్ మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 207 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి వన్డేలో 19 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా‌ని రెండో వన్డేలో 24 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ లెక్కని సరిచేసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ 1-1తో ఆసక్తికరంగా మారింది. నిర్ణయాత్మక ఆఖరి వన్డే బుధవారం జరగనుంది.
ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో డకౌట్ అయ్యాడు. ఏడు బంతులాడి ఒక్క పరుగు కూడా చేయలేదు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (21) ధాటిగా ఆడినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఈ సమయంలో జో రూట్ (39: 73 బంతుల్లో 4x4, 1x6), కెప్టెన్ ఇయన్ మోర్గాన్ (42: 52 బంతుల్లో 5x4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో కొద్ది వ్యవధిలో రూట్, జొస్ బట్లర్ (3) పెవిలియన్ చేరారు.

ఆదుకున్న కరన్, రషీద్:

ఆదుకున్న కరన్, రషీద్:

ఆ తర్వాత ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. సామ్ బిల్లింగ్స్, సామ్ కరన్ త్వరగానే పెవిలియన్ చేరారు. క్రిస్‌ వోక్స్ (26) పర్వాలేదనిపించాడు. ఇక చివరలో టామ్ కరన్ (37: 39 బంతుల్లో 5x4), ఆదిల్ రషీద్ (35: 26 బంతుల్లో 3x4, 1x6) దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా మూడు.. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీశారు.

 చెలరేగిన వోక్స్, ఆర్చర్:

చెలరేగిన వోక్స్, ఆర్చర్:

232 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకి శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 6 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ అరోన్ ఫించ్ (73: 105 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీ చేశాడు. మార్నస్ లబుషేన్ (48: 59 బంతుల్లో 3x4) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడడంతో ఆస్ట్రేలియా 30.4 ఓవర్లు ముగిసే సమయానికి 144/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే వోక్స్, ఆర్చర్ వికెట్ల వేట కొనసాగించడంతో ఆసీస్ తడబడింది. లబుషేన్, మిచెల్ మార్ష్ (1), అరోన్ ఫించ్ పెవిలియన్ చేరిపోయారు.

పోరాడిన క్యారీ:

పోరాడిన క్యారీ:

చివరలో శామ్ కరన్ రెచ్చిపోయాడు. దీంతో గ్లెన్ మాక్స్‌వెల్ (1), పాట్ కమిన్స్ (11), మిచెల్ స్టార్క్ (0), ఆడమ్ జంపా (0)లు కొద్ది వ్యవధిలోనే ఔట్ అయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (36) పోరాడాడు. చివరి వికెట్ రూపంలో క్యారీ కూడా ఔటవడంతో ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలోనే 207 పరుగులకి ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బౌలర్లలో ‌వోక్స్, ఆర్చర్, కరన్ మూడేసి వికెట్లు పడగొట్టారు.

IPL 2020: బ్యాట్స్‌మన్‌లు జాగ్రత్త.. వికెట్లు విరగ్గొడుతున్న ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్!!

Story first published: Monday, September 14, 2020, 10:36 [IST]
Other articles published on Sep 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X