న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రనౌట్ చేయడంలో పొరపాటు.. అంపైరే ఆశ్చర్యపోయాడు (వీడియో)

England Women’s Cricketer Kate Cross Makes A Blunder In Effecting A Run-Out || Oneindia Telugu
England Women’s cricketer Kate Cross makes a blunder in effecting a run-out

లండన్‌ వేదికగా వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ మహిళా జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 42 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌ బౌలర్‌ కేట్‌ క్రాస్‌ చేసిన పొరపాటు కారణంగా మైదానంలోని క్రీడాకారిణులతో సహా అంపైరే ఆశ్చర్యపోయాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఏం జరిగిందంటే!!. కేట్‌ క్రాస్‌ వేసిన బంతిని విండీస్‌ బ్యాటర్‌ షాట్ ఆడగా.. బంతిని ఫీల్డర్ అందుకుని కేట్‌ క్రాస్‌కు త్రో వేసింది. షాట్ ఆడిన బ్యాటర్‌ నాన్‌స్ట్రైకింగ్‌ వైపు పరుగెడుతున్నా.. కేట్‌ క్రాస్‌ అది గమనించకుండా కీపర్‌ వైపు పరుగెడుతున్న బ్యాటర్‌ని ఔట్‌ చేసేందుకు ప్రయత్నించింది. కీపర్‌ వైపు బంతి వేసే సమయంలో ఆ బ్యాటర్‌ క్రీజులోకి వెళ్ళింది. క్రాస్‌ బంతిని కీపర్‌ వైపు వేసే సమయానికి స్ట్రైకింగ్ బ్యాటర్‌ (షాట్ ఆడిన బ్యాటర్‌) సగం క్రీజులోకి మాత్రమే రావడం విశేషం.

కేట్‌ క్రాస్‌ చేసిన తప్పిదంతో ఏ బ్యాటర్ కూడా అవుట్ కాలేదు. కేట్‌ క్రాస్‌ పొరపాటు చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. 'నాన్‌స్ట్రైకర్‌ని ఔట్‌ చేసే సత్తా నీకే ఉంది', 'నీ తెలివితోనూ అందరిని ఆకట్టుకున్నావు' 'మీరు చేసిన పనికి అంపైర్‌ సైతం ఆశ్చర్యపోయాడు' అని కామెంట్లు పెడుతున్నారు. వీడియో చూస్తే నవ్వడం ఖాయం. మరి ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్కేయండి. కేట్‌ క్రాస్‌ మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసి 30 పరుగులిచ్చింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి ఓడిపోయింది.

Story first published: Monday, June 24, 2019, 9:39 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X