న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs West Indies: క్రికెట్‌ చరిత్రలో స్టువర్ట్‌ బ్రాడ్‌ అరుదైన రికార్డు

England vs West Indies: Stuart Broad becomes 7th bowler to claim 500 wickets in Test cricket

మాంచెస్టర్‌: ఇంగ్లండ్ సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన ఏడో బౌలర్‌గా బ్రాడ్‌ రికార్డుల్లోకెక్కాడు. సుధీర్ఘ ఫార్మాట్‌లో 500 వికెట్ల మైలురాయిని అధిరోహించిన నాలుగో ఫాస్ట్ ‌బౌలర్‌గా నిలిచి దిగ్గజాల సరసన చేరాడు. మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో బ్రాడ్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. 140 టెస్టుల్లోనే బ్రాడ్‌ అద్భుత రికార్డును అందుకోవడం విశేషం.

రెండవ బౌలర్‌గా అరుదైన రికార్డు

రెండవ బౌలర్‌గా అరుదైన రికార్డు

మాంచెస్టర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతుంది. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ను ఔట్‌ చేయడం ద్వారా 500వ వికెట్‌ను స్టువర్ట్‌ బ్రాడ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండవ బౌలర్‌గా నిలిచాడు. బ్రాడ్‌ కంటే ముందు జేమ్స్ అండర్సన్ 500 వికెట్ల క్లబ్‌లో ఉన్నాడు. 2017లో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లోనే అండర్సన్ ఈ ఫీట్ అందుకున్నాడు.

మురళీధరన్@1

మురళీధరన్@1

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్ర స్థానంలో ఉన్నాడు. మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్లు తీశాడు. లంక దిగ్గజం 133 టెస్టుల్లోనే 800 వికెట్లు తీయడం విశేషం. ప్రస్తుతానికి స్టువర్ట్‌ బ్రాడ్ కంటే ముందు ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అనిల్ కుంబ్లే (619), జేమ్స్ అండర్సన్ (589), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కోర్ట్నీ వాల్ష్ (519) ఉన్నారు. తొలి మూడు స్థానాల్లో ఉన్న ముగ్గురు స్పిన్నర్లే కావడం విశేషం. ప్రస్తుతం ఆండర్సన్‌, బ్రాడ్‌ మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నారు.

34 ఏళ్ల వయస్సులోనూ

34 ఏళ్ల వయస్సులోనూ

స్టువర్ట్‌ బ్రాడ్ రికార్డు స్థాయిలో 500 వికెట్లు పడగొట్టడంపై సహచర క్రికెటర్లు, మాజీలు అభినందనలు తెలియజేస్తున్నారు. 500 వికెట్ల క్లబ్‌లో చేరిన బ్రాడ్.. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన పేస్‌ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. 34 ఏళ్ల వయస్సులోనూ గంటకు సుమారు 90 మైళ్ల వేగంతో బంతులు విసురుతూ బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్నాడు. ప్రస్తుతం బ్రాడ్ ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

ఇంకా 315 పరుగులు

ఇంకా 315 పరుగులు

లక్ష్య ఛేదనలో ఓవర్ నైట్ స్కోర్ 10/2తో ఇదో రోజు ఆట కొనసాగించిన విండీస్ బ్యాట్స్‌మన్‌.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్ (19), షై హోప్ (31), షమర్ బ్రూక్స్ (22) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. బ్రాత్‌వైట్ వికెట్ బ్రాడ్ తీయగా.. హోప్, బ్రూక్స్ వికెట్లను వోక్స్ పడగొట్టాడు. లంచ్ సమయానికి విండీస్ 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 315 పరుగులు చేయాలి. ఒకవేళ డ్రా కోసం ఆడినా 5 వికెట్లతో రెండు సెషన్ల పాటు కాచుకోవాలి.

అగ్ర అథ్లెట్లలో కోహ్లీ ఒకడు.. ఫిట్‌నెస్‌ విషయంలో మా ఆటగాళ్లు ఏమాత్రం..: పాక్ కోచ్

Story first published: Tuesday, July 28, 2020, 18:31 [IST]
Other articles published on Jul 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X