న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌పై‌ విండీస్‌ ఆధిపత్యం.. 16 ఓవర్లలో 17 పరుగులే!!

England vs West Indies: Dominic Sibley solid as England reduce deficit

సౌతాంప్టన్‌: కరోనా వైరస్ విరామం త‌ర్వాత ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మ‌ధ్య జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. విండీస్ పేస్ విభాగం ముందు సొంతగడ్డపై ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ల పప్పులు ఏమాత్రం ఉడకట్లేదు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతున్నారు. కరీబియన్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందిపడుతున్నారు. బంతితో నిప్పులు చెలరేగుతూ ఇంగ్లండ్‌ను విండీస్‌ కట్టడి చేస్తోంది.

నాలుగో రోజు ఆటలో లంచ్‌ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 40 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 79 పరుగులు చేసింది. శనివారం ఉదయం ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్లు నిలకడగా రాణించడంతో ఇంగ్లండ్‌కు‌ శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోరి బర్న్స్ ‌(42), డొమినిక్ సిబ్లే జోడీ కుదురుకోవడంతో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. అయితే హాఫ్‌ సెంచరీకి చేరువైన బర్న్స్‌ చెత్త షాట్‌ ఆడి రోస్టన్‌ ఛేజ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

ప్రస్తుతం సిబ్లే (48), జో డెన్లీ (11) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ మరో వికెట్‌ పడకూడదన్న ఉద్దేశంతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. దీంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. నాలుగో రోజూ విండీస్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. బౌలర్లు హవా కొనసాగుతుండటంతో.. డ్రింక్స్‌ విరామం తర్వాత 16 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం 17 పరుగులు మాత్రమే సాధించింది. చాలా ఓవర్లు మెయిడిన్‌ కావడం విశేషం. విండీస్‌ అద్భుత బంతులేయడంతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ తడబడుతున్నారు. అయితే ఇంగ్లండ్ కేవలం 4 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. 51 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో‌ విండీస్ బౌలర్లు చెలరేగగా.. తాత్కాలిక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (43) ఆదుకున్నాడు. ఇక విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ ‌(4/49) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. దీంతో స్టోక్స్‌ ఓ అరుదైన ఘనతను సాధించాడు. మూడో రోజు ఆటలో విండీస్‌ బ్యాట్స్‌మన్‌ అల్జారీ జోసెఫ్‌ను స్టోక్స్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇది టెస్టుల్లో స్టోక్స్‌కు 150వ వికెట్‌ కావడం విశేషం. దీంతో టెస్టుల్లో వేగంగా 4వేల పరుగులు, 150 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా స్టోక్స్‌ నిలిచాడు. స్టోక్స్‌ 64 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్‌ లెజెండ్‌ గ్యారీ సోబర్స్‌ 63 టెస్టుల్లోనే ఈ మైలురాయిని అందుకుని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టీమిండియా మాజీ క్రికెటర్‌ భార్యకు కరోనా పాజిటివ్‌!!టీమిండియా మాజీ క్రికెటర్‌ భార్యకు కరోనా పాజిటివ్‌!!

Story first published: Saturday, July 11, 2020, 19:20 [IST]
Other articles published on Jul 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X