న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సమమా... సంచలనమా.. నేటి నుంచి ఇంగ్లండ్-వెస్టిండీస్ రెండో టెస్ట్

England vs West Indies 2nd Test: With Joe Root’s return, England eye redemption in Manchester

మాంచెస్టర్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ధైర్యం చేసి ఇంగ్లండ్‌కు వచ్చిన వెస్టిండీస్ ఈ సిరీస్‌ను విజయంతో ఆరంభిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. స్వదేశంలో చాలా బలంగా ఉండే ఇంగ్లండ్ జట్టుకు పోటీ ఇస్తేనే గొప్ప అనుకున్నారంతా. కానీ కసిగా పోరాడిన విండీస్ వీరులు.. రోస్ బౌల్ స్టేడియంలో ఆతిథ్య జట్టు మైండ్ బ్లాక్ చేశారు. 1-0తో లీడ్‌లో ఉన్న జాసన్ హోల్డర్ సేన ఆత్మవిశ్వాసం అమాంతం పెరగ్గా.. ఇంగ్లండ్ డిఫెన్స్‌లో పడింది.

 బెడిసికొట్టిన నిర్ణయం.

బెడిసికొట్టిన నిర్ణయం.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిలవాలంటే విజయం అనివార్యమైన పరిస్థితిలో గురువారం మధ్యాహ్నం 3.30 నుంచి జరిగే సెకండ్ టెస్ట్‌లో రూట్‌సేనకు సవాల్ ఎదురువనుంది. రోస్ బౌల్‌లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన ఆతిథ్య జట్టు అనేక తప్పిదాలు చేసింది. పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను పక్కనపెట్టడంతో వివాదం చెలరేగగా.. వర్షంతో తడిసిన పిచ్‌పై తాత్కలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం బెడిసికొట్టింది.

సువర్ణవకాశం..

సువర్ణవకాశం..

విండీస్ పేస్ అటాక్ ముందు ఆతిథ్య బ్యాటింగ్ లైనప్ ఇబ్బంది పడడంతో ఓటమి తప్పలేదు. దాంతో మాంచెస్టర్‌లో ఆ తప్పిదం చేయకూడదని ఇంగ్లండ్ ఆశిస్తుండగా.. తొలి టెస్ట్ విజయాన్ని పునరావృతం చేయాలని విండీస్ కోరుకుంటుంది. పైగా ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌పై ఆ జట్టుదే పై చేయి అవుతోంది. ఇంగ్లీష్ టీమ్‌తో ఆడిన గత ఆరు టెస్ట్‌ల్లో విండీసే గెలిచింది. మరో మ్యాచ్‌లో విజయం సాధిస్తే మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ కైవసం చేసుకునే గోల్డెన్ చాన్స్ హోల్డర్ సేనను ఊరిస్తోంది. వెస్టిండీస్‌ చివరిసారిగా 1998లో ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గింది.

డెన్లీపై వేటు... అండర్సన్, వుడ్‌లకు విశ్రాంతి

డెన్లీపై వేటు... అండర్సన్, వుడ్‌లకు విశ్రాంతి

సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్‌ తుది జట్టును మ్యాచ్‌ రోజే ప్రకటించనుంది. అయితే తొలి టెస్టులో ఆడిన ముగ్గురిని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ జో రూట్‌ మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. దాంతో జో డెన్లీని తుది జట్టు నుంచి తప్పించారు. నిజానికి రూట్‌ స్థానంలో తొలి టెస్టులో క్రాలీ ఆడినా... రెండో ఇన్నింగ్స్‌లో అతను బాగా ఆడటం, డెన్లీ రెండుసార్లు కూడా విఫలం కావడంతో వేటు తప్పలేదు. తొలి టెస్టులో ఆడిన బౌలర్లు అండర్సన్, మార్క్‌ వుడ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానాల్లో స్టువర్ట్‌ బ్రాడ్, ఒలీ రాబిన్సన్‌లను 13 మందితో ప్రకటించిన జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్టులో తనను తుది జట్టు నుంచి తప్పించడంపై స్టువర్ట్‌ బ్రాడ్‌ బహిరంగంగానే అసంతృప్తిని ప్రకటించాడు. మొత్తంగా చూస్తే బ్యాటింగ్‌ వైఫల్యం గత మ్యాచ్‌లో ఓటమికి కారణమైంది.

మార్పుల్లేకుండానే...

మార్పుల్లేకుండానే...

తొలి టెస్టు విజయంలో విండీస్‌ ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు కీలకపాత్ర పోషించారు. అవసరమైన సందర్భంలో పట్టుదలగా ఆడి సమష్టితత్వంతో గెలిపించారు. కాబట్టి సహజంగానే అదే తుది జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాస్త ఉదాసీనత ప్రదర్శించకుండా ఉంటే మరో గెలుపు సాధించేందుకు టీమ్‌కు అన్ని రకాలుగా అర్హత ఉంది. నలుగురు పేస్‌ బౌలర్ల మంత్రం గత మ్యాచ్‌లో ఫలించింది. ముఖ్యంగా హోల్డర్, గాబ్రియెల్‌ ప్రత్యర్థిని బాగా దెబ్బ కొట్టారు. వీరికి తోడు రోచ్‌ కూడా చెలరేగాల్సి ఉంది. ఏకైక స్పిన్నర్‌ ఛేజ్‌ తన విలువేంటో మళ్లీ చూపించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్‌ శుభారంభం అందిస్తే విండీస్‌ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. తనలో ప్రతిభను బ్లాక్‌వుడ్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో బయటపెట్టాడు. విడివిడిగా చూస్తే ఏ ఒక్కరూ స్టార్‌ కాకపోయినా జట్టుగా విండీస్‌ చెలరేగింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తే మరో గెలుపు అసాధ్యం కాబోదు.

జట్లు (అంచనా)

జట్లు (అంచనా)

ఇంగ్లండ్‌: రోరి బర్న్స్‌, సిబ్లే, జో రూట్‌ (కెప్టెన్‌), క్రాలే, స్టోక్స్‌, పోప్‌, బట్లర్‌, బెస్‌, ఆర్చర్‌, బ్రాడ్‌, సామ్‌ కర్రాన్‌.

వెస్టిండీస్‌: క్యాంప్‌బెల్‌, బ్రాత్‌వైట్‌, షాయ్‌ హోప్‌, బ్రూక్స్‌, చేజ్‌, బ్లాక్‌వుడ్‌, డౌరిచ్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), జోసెఫ్‌, రోచ్‌, గాబ్రియెల్‌.

Story first published: Thursday, July 16, 2020, 9:30 [IST]
Other articles published on Jul 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X