న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రసపట్టులో రెండో టెస్టు.. విజృంభించిన బ్రాడ్‌, వోక్స్‌.. పోరాడిన బ్రాత్‌వైట్‌, బ్రూక్స్‌

England vs West Indies, 2nd Test: Stuart Broad and Chris Woakes give England massive advantage on Day 4

మాంచెస్టర్‌: తొలిరోజు ఈ టెస్ట్‌ నెగ్గి సిరీస్‌ రేసులో నిలవాలని ఇంగ్లండ్‌ పట్టుదలగా ఆడితే.. ఆ తర్వాత డ్రా చేసుకొనే లక్ష్యంతో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ చేసింది. దాంతో రెండో టెస్ట్‌ ఆదివారం (నాలుగో రోజు) ఆట టీ విరామం వరకు ప్రశాంతంగానే సాగింది. అయితే ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసి ఆతిథ్య జట్టు గెలుపు ఆశలకు రేకెత్తించాడు. ఆపై విండీస్‌ బౌలర్లు కూడా విజృంభించి రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్‌ రసపట్టులో పడింది. మొత్తానికి ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వర్షం కారణంగా ఓ రోజు ఆట మొత్తం తుడిచి పెట్టుకుపోయినా.. ఆతిథ్య జట్టు ఫలితం రాబట్టాలని ప్రయత్నిస్తున్నది.

ఐపీఎల్ 2020 చివరి టోర్నీ అని చెప్పలేను: భారత వెటరన్ ప్లేయర్ఐపీఎల్ 2020 చివరి టోర్నీ అని చెప్పలేను: భారత వెటరన్ ప్లేయర్

ఫాలోఆన్‌ ఆడించాలని:

ఫాలోఆన్‌ ఆడించాలని:

తొలి ఇన్నింగ్స్‌ను 469/9 వద్ద డిక్లేర్‌ చేసిన ఇంగ్లండ్‌.. ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించాలని ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 287 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (75; 165 బంతుల్లో 8×4), షమర్‌ బ్రూక్స్‌ (68; 137 బంతుల్లో 11×4), రోస్టన్‌ చేజ్‌ (51; 85 బంతుల్లో 7×4) పోరాడటంతో విండీస్‌ ఫాలోఆన్‌ను త్రుటిలో తప్పించుకుంది. పేసర్లు స్టువర్ట్‌ బ్రాడ్‌ (3/66), క్రిస్‌ వోక్స్‌ (3/42), సామ్‌ కరన్‌ (2/70) విండీస్ జట్టును కట్టడి చేశారు.

ఆధిక్యం 219:

ఆధిక్యం 219:

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌.. ఆట చివరకు 37/2తో నిలిచింది. వేగంగా పరుగులు రాబట్టే ఉద్దేశంతో బెన్ స్టోక్స్‌ (16 బ్యాటింగ్‌), జోస్ బట్లర్‌ (0) ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే రోచ్‌.. బట్లర్‌తో పాటు క్రాలీ (11)ను ఔట్‌ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. స్టోక్స్‌కు తోడుగా కెప్టెన్ జో రూట్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ మొత్తం ఆధిక్యం 219కి చేరుకుంది. ఇక సోమవారం ఆటకు చివరి రోజు. ఇంగ్లండ్‌ తొలి సెషన్లో వేగంగా ఆడి 300 పైచిలుకు లక్ష్యాన్ని విండీస్‌కు నిర్దేశించి విజయం కోసం ప్రయత్నించే అవకాశముంది.

ఆదుకున్న బ్రాత్‌వైట్‌:

ఆదుకున్న బ్రాత్‌వైట్‌:

ఆదివారం ఉదయం 32/1తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌... 10 ఓవర్లకు పైగా వికెట్‌ కోల్పోలేదు. చాలాసేపు విసిగించిన అల్జారి జోసెఫ్‌ (25) చివరికి బెస్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత షై హోప్‌ (25) అండతో బ్రాత్‌వైట్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 112/2తో విండీస్‌ లంచ్‌కు వెళ్లింది. రెండో సెషన్‌ ఆరంభమైన కాసేపటికే హోప్‌ ఔటైనప్పటికీ.. బ్రాత్‌వైట్‌కు జత కలిసిన బ్రూక్స్‌ ఇంగ్లిష్‌ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కున్నాడు. బ్రాత్‌వైట్‌ ఏ తడబాటూ లేకుండా బ్యాటింగ్‌ కొనసాగించడంతో మరో వికెట్‌ కోల్పోకుండా 200కు చేరువైంది విండీస్‌.

తోక తెంచిన వోక్స్‌:

తోక తెంచిన వోక్స్‌:

199/3తో ఉన్న విండీస్‌ జట్టు ఆదివారం ఆలౌటయ్యేలా కనిపించలేదు. అయితే బ్రాత్‌వైట్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో ఔట్‌ చేసిన స్టోక్స్‌.. ఇంగ్లండ్‌కు మళ్లీ ఆశలు కల్పించాడు. అక్కడి నుంచి విండీస్‌ పతనం మొదలయింది. బ్లాక్‌వుడ్‌ (0), డౌరిచ్‌ (0), జేసన్ హోల్డర్‌ (2) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. దీంతో స్కోరు 260/8కు చేరుకుంది. 2 వికెట్లు చేతిలో ఉన్న విండీస్‌.. ఫాలోఆన్‌ తప్పించుకోవడానికి ఇంకా 9 పరుగులు చేయాల్సి ఉంది. అయితే రోచ్‌ (5 నాటౌట్‌) అండతో చేజ్‌ పెద్ద ప్రమాదం తప్పించాడు. తర్వాత రోచ్‌ సహా గాబ్రియెల్‌ (0)లను ఒకే ఓవర్లో వోక్స్‌ పెవిలియన్ పంపాడు.

Story first published: Monday, July 20, 2020, 7:41 [IST]
Other articles published on Jul 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X