న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నలుగురు హాఫ్ సెంచరీలు: దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 312

England vs South Africa Live Score, World Cup 2019: England are 311 for 8

హైదరాబాద్: ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ 79 బంతుల్లో 89 (9 ఫోర్లు), జాసన్ రాయ్ 53 బంతుల్లో 54(8 ఫోర్లు), జో రూట్59 బంతుల్లో 51(5 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 60 బంతుల్లో 57 (4 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. దీంతో సఫారీలకు 312 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టుకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెప్లిస్‌ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ తొలి ఓవ‌ర్‌ను సీనియర్ స్పిన్న‌ర్ ఇమ్రాన్ త‌హీర్‌తో వేయించాడు.

మొదటి బంతికి జేసన్ రాయ్ ఒక పరుగు సాధించాడు. ఆ తర్వాత రెండో బంతికి బెయిర్‌స్టో ఔట్ చేశాడు. తాహిర్ వేసిన బంతి బెయిర్ స్టో బ్యాట్‌ను తాకి నేరుగా వికెట్ కీప‌ర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఓ ఓపెన‌ర్ డ‌కౌట్ కావ‌డం ఇదే మొద‌టిసారి. గోల్డెన్ డ‌కౌట్ అయిన తొలి ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ కూడా బెయిర్‌స్టో కావ‌డం విశేషం.

1
43644

ఆ తర్వాత రాయ్, జో రూట్‌లు నిలకడగా ఆడి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. జేసన్ రాయ్ తొలుత 51 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ చేయగా... ఆ తర్వాత జో రూట్‌ 56 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

{headtohead_cricket_2_6}

అనతంరం జట్టు స్కోరు 107 పరుగుల వద్ద ఫెలుక్వాయో బౌలింగ్‌లో జేసన్ రాయ్ 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే జో రూట్‌(51) కూడా రబాడ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌‌కు చేరడం అనంతరం క్రీజులోకి వచ్చన బెన్ స్టోక్స్ 79 బంతుల్లో 89 (9 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి ఇంగ్లాండ్‌కు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 44 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేసిన స్టోక్స్ జట్టు స్కోరు చివర్లో పెవిలియన్‌కు చేరాడు.

ఇలా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో నలుగురు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు హాఫ్‌ సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్(18), మొయిన్ అలీ(3), క్రిస్ వోక్స్(13) పరుగులు చేశారు. కాగా, సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీయగా.. ఇమ్రాన్ తాహిర్, కగిసో రబాడ చెరో రెండు వికెట్లు తీయగా ఫెలుక్వాయోకు ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Thursday, May 30, 2019, 19:01 [IST]
Other articles published on May 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X