న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Pakistan: కుర్చీలో నుంచి పడ్డ పాక్ ప్లేయర్.. నవ్వులే నవ్వులు! (వీడియో)

England vs Pakistan: Imam-ul-Haq falls down his teammates couldn’t control their laughter

సౌతాంప్టన్: ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ బెంచ్ బ్యాట్స్‌మన్ ఇమామ్ ఉల్ హక్ డగౌట్‌లోని కూర్చీ మీది నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీన్ని చూసిన సహచర ఆటగాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు. కనీసం అతన్ని లేపకుండా పగలబడి నవ్వారు. ముఖ్యంగా సర్ఫరాజ్ అహ్మద్, షాన్ మసూద్ అయితే నోరు అడ్డు పెట్టుకొని మరీ నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటనలో ఇమామ్ ఉల్ హక్ ఎలాంటి గాయాలు కాలేదు.

ఈ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 'నీ ఆటతో కన్నా ఈ ఘటనతో నువ్వు ఫేమస్ అవుతావ్ పో'అని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఏం స్నేహం బ్రదర్స్.. మీలా ఉండాలని కామెంట్ చేస్తున్నారు. అయ్యో ఎంత పనాయే అనే మీమ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు.

ఇక ఇమామ్ ఉల్ హక్‌కు ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతను పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసే ఇమామ్‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో అతను బంగ్లాదేశ్‌పై సెంచరీ కూడా చేశాడు. అతని కెరీర్‌లో ఇప్పటి వరకు 11 టెస్ట్‌లు ఆడి 485 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. 37వన్డేల్లో 53.84 సగటుతో 1723 రన్స్ చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలున్నాయి.

ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పాక్ ఓటమికి ఎదురీదుతోంది. నాలుగో రోజు ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో నాలుగో రోజు 56 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. క్రీజులో కెప్టెన్‌ అజహర్‌ అలీ (29 బ్యాటింగ్‌), బాబర్‌ ఆజమ్‌ (4 బ్యాటింగ్‌) ఉన్నారు. పాక్ ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఇంకా 210 పరుగులు చేయాలి. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే.

పదేళ్ల పాటు ఒక్కపూటే తిన్నా.. అర్జున అవార్డీ సారికా కాలేపదేళ్ల పాటు ఒక్కపూటే తిన్నా.. అర్జున అవార్డీ సారికా కాలే

Story first published: Tuesday, August 25, 2020, 13:44 [IST]
Other articles published on Aug 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X