న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Pakistan: రెండో టెస్టుకు వ‌ర్షం అంతరాయం.. పాకిస్థాన్ 85/2

England vs Pakistan 2nd Test: Rain stops play, Pakistan two down

సౌతాంప్ట‌న్‌: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాంప్ట‌న్‌లోని ది రోజ్ బౌల్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జ‌రుగుతున్న రెండో టెస్టుకు వరణుడు అడ్డుపడ్డాడు. వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో మ్యాచ్ ఇప్పటికే రెండుసార్లు నిలిచిపోయింది. రెండో సెష‌న్‌లో మ్యాచ్ నిలిచే సమయానికి పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ అబిద్ అలీ (49), స్టార్ బ్యాట్స్‌మన్‌ బాబర్ ఆజామ్ (7) ఉన్నారు. ఇంగ్లీష్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రెండు వికెట్లు తీశాడు.

సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ అజర్ అలీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. మొదటి టెస్టులో సెంచరీ చేసిన షాన్ మసూద్ (1) జేమ్స్ అండర్సన్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో పాక్ ఆరు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అజర్ అలీతో మరో ఓపెనర్ అబిద్ అలీ నిలకడగా ఆడాడు. ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. 24వ ఓవ‌ర్ న‌డుస్తున్న స‌మ‌యంలో వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో మ్యాచ్ నిలిచిపోయింది.

అనంత‌రం వ‌రుణ‌డు తెరిపినివ్వ‌గా.. అంపైర్లు లంచ్ బ్రేక్ ప్ర‌క‌టించారు. లంచ్ స‌మ‌యానికి పాక్ ఒక వికెట్ న‌ష్టానికి 62 ప‌రుగులు చేసింది. ఆపై మ్యాచ్ ప్రారంభం కాగా.. అబిద్ అలీ కొన్ని మంచి షాట్లు ఆడాడు. అయితే జేమ్స్ అండర్సన్ వేసిన 31వ ఓవర్ ఇదో బంతికి అజర్ అలీ (20) క్యాచ్ ఔట్ అయ్యాడు. అండర్సన్ బౌలింగ్లో అజర్ పెవిలియన్ చేరడం ఇది 8వ సారి. వికెట్ కోల్పయినా అబిద్ అలీ మాత్రం తదడబడలేదు. అతనికి బాబర్ ఆజామ్ అండగా నిలిచాడు. ఇక 34వ ఓవర్ నడుస్తుండగా వరణుడు మరోసారి అడ్డుపడ్డాడు. ప్ర‌స్తుతం వర్షం తగ్గింది. మైదానం చిత్త‌డిగా మార‌డంతో మ్యాచ్ ప్రారంభం అయ్యేందుకు ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన రెండు జట్లు స్పల్ప మార్పులు చేశాయి. వ్యక్తిగత కారణాలతో మిగతా రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ స్థానంలో జాక్ క్రాలీ, ఆర్చర్ ప్లేస్‌లో సామ్ కరణ్ జట్టులోకి వచ్చారు. ఇక పాక్ జట్టులో షాదాబ్ ఖాన్ స్థానంలో ఫవాద్ ఆలమ్ వచ్చాడు. ఆలమ్ 11 ఏళ్ల సుదీర్ఘ విరామం.. 3,910 రోజులు, 88 టెస్ట్‌లు తర్వాత పునరాగమనం చేశాడు. చివరిసారిగా 2009‌ నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాక్ మొత్తం 88 మ్యాచ్‌లు ఆడగా.. ఫవాద్‌కు మాత్రం అవకాశం దక్కలేదు. తొలి టెస్ట్‌ గెలిచిన ఉత్సాహంతో ఇంగ్లండ్ జట్టు ఉంటే.. ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉండడంతో ఒత్తిడంతా పాక్‌పై నెలకొంది.

Left-Handers Day: నా ఫేవరెట్స్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్ ఆ నలుగురే.. మరి మీకు?!!Left-Handers Day: నా ఫేవరెట్స్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్ ఆ నలుగురే.. మరి మీకు?!!

Story first published: Thursday, August 13, 2020, 20:23 [IST]
Other articles published on Aug 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X