న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేటి నుంచే‌ తొలి టెస్టు.. ఇంగ్లండ్‌ జోరు కొనసాగేనా?.. సత్తాచాటేందుకు పాక్ సిద్ధం!!

England vs Pakistan 1st Test match live streaming and timing

మాంచెస్టర్‌: కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన క్రికెట్‌ను తిరిగి మైదానంలోకి తీసుకొచ్చిన ఘనత ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ది. బయో బబుల్ వాతావరణంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇంగ్లండ్.. ఇక పాకిస్థాన్‌తో పోరుకు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరుకు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచిన ఇంగ్లండే ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలో దిగనుంది. అయితే ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించని పాకిస్థాన్‌ను తక్కువ అంచన వేయలేం.

ఆత్మవిశ్వాసంతో రూట్‌ సేన:

ఆత్మవిశ్వాసంతో రూట్‌ సేన:

స్వదేశంలో టెస్టుల్లో ఇంగ్లండ్‌ అత్యంత బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల విండీస్‌ తొలి మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా ఇంగ్లండ్‌ జట్టులోని లోపాలను కూడా బయటపెట్టింది. చివరకు సిరీస్‌ ఇంగ్లండ్‌ గెలిచినా.. పాకిస్తాన్ జట్టుకు బలమైన బౌలింగ్‌ దళం ఉండటంతో సిరీస్‌ ఏకపక్షం కాకపోవచ్చు. గత సిరీస్‌ నెగ్గిన ఆటగాళ్లతోనే 14 మంది సభ్యుల జట్టును ఈ టెస్టు కోసం ఇంగ్లండ్‌ ప్రకటించింది. విండీస్‌పై సిరీస్‌ నెగ్గిన ఆత్మవిశ్వాసంతో రూట్‌ సేన బరిలోకి దిగుతోంది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న ఇంగ్లీష్ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మరోసారి సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. వెస్టిండీస్‌తో చివరి టెస్టు ఆడిన జట్టునే పాక్‌తో తొలి మ్యాచ్‌లో బరిలో దింపే అవకాశం ఉంది.

 బాబర్‌, అజహర్‌లపైనే భారం:

బాబర్‌, అజహర్‌లపైనే భారం:

ఈ సిరీస్‌ కోసం మొదట ప్రకటించిన 29 మంది సభ్యుల జట్టులో పది మంది ఆటగాళ్లకు కరోనా సోకడంతో షాక్‌కు గురైన పాకిస్థాన్‌.. ఆ సంఘటన నుంచి తేరుకుని మ్యాచ్‌కు మెరుగ్గానే సన్నద్ధమైంది. దాదాపు నెల రోజుల కంటే ముందే అక్కడికి చేరుకుని.. క్వారంటైన్‌ పూర్తి చేసుకుని.. తమ ఆటగాళ్లనే రెండు జట్లుగా విభజించి సన్నాహక మ్యాచ్‌లాడి ఫామ్ అందుకుంది. అయితే పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ బలం ప్రధానంగా ఇద్దరు టాప్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ ఆజమ్, కెప్టెన్‌ అజహర్‌ అలీలపైనే ఆధారపడి ఉంది. వీరిద్దరు మాత్రమే నిలకడగా ఆడగల సమర్థులు. అసద్‌ షఫీఖ్, ఓపెనర్‌ షాన్‌ మసూద్, హారిస్‌ సొహైల్‌ కూడా తమ వంతు బాధ్యత పోషించాల్సి ఉంది. మరో ఓపెనర్‌ ఆబిద్‌ అలీ తొలిసారి ఇంగ్లండ్‌ గడ్డపై ఆడనున్నాడు.

పటిష్ఠంగా బౌలింగ్‌:

పటిష్ఠంగా బౌలింగ్‌:

పాకిస్తాన్ జట్టు బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. యువ పేసర్లు నసీమ్‌ షా, షహీన్‌ అఫ్రిది ఉరకలెత్తే ఉత్సాహం మీద ఉన్నారు. ఇద్దరు స్పిన్నర్లతో పాక్‌ బరిలోకి దిగాలని భావిస్తోంది కాబట్టి.. షాదాబ్ ఖాన్‌, యాసిర్‌ షా తుది జట్టులో ఉండనున్నారు. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో పోరు అంటే ఏ జట్టుకైనా కఠిన పరీక్షే. అక్కడి బౌన్సీ, స్వింగ్‌ పిచ్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసురుతాయి. ఇలాంటి ప్రతికూలతల మధ్య ఆ జట్టును పాక్‌ ఎలా నిలువరిస్తుందో చూడాలి. అయితే గత రెండు పర్యటనలను (2016లో 2-2, 2018లో 1-1) పాక్‌ డ్రాగా ముగించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఇంగ్లండ్‌లో పాకిస్తాన్‌ 53 టెస్టులు ఆడగా.. 12లో గెలిచి, 23లో ఓడింది. మరో 18 డ్రాగా ముగిశాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కి ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ సిక్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

చెలరేగిన స్టిర్లింగ్.. ఇంగ్లండ్‌కు షాక్.. భారీ టార్గెట్ ఛేదించిన ఐర్లాండ్‌!!

Story first published: Wednesday, August 5, 2020, 8:36 [IST]
Other articles published on Aug 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X