న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లీషు గడ్డపై రాణించాలంటే..: మీడియా సమావేశంలో రహానే

By Nageshwara Rao
England vs India: Bowlers need to be patient to bag wickets, says Ajinkya Rahane

హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై రాణించాలంటే ఓపిక అనేది చాలా కీలకమని టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే పేర్కొన్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరిస్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య బుధవారం (ఆగస్టు 1) నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆరంభం కానుంది.

ఈ నేపథ్యంలో రహానే సోమవారం మీడియాతో మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌లో పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ అంత సులభం కాకపోవచ్చు. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేయాలంటే ఓపిక అనేది కీలకం. పిచ్ పరిస్థితులకు అనుకూలంగా బంతులు సంధిస్తేనే ఫలితం దక్కుతుంది" అని అన్నాడు.

1
42374

వృథా ప్రయాస తప్పదు

"లేకపోతే వృథా ప్రయాస తప్పదు. వికెట్ల వేటలో ఒక బౌలర్ ముందుండి నడిపిస్తే.. మిగతా వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. టెస్ట్‌ల్లో నిలకడగా 20 వికెట్లు తీయడం బౌలర్ల సత్తాకు పరీక్షగా నిలుస్తుంది. దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఎవరూ ఊహించని విధంగా బౌలర్లు వికెట్లు పడగొట్టారు" అని రహానే పేర్కొన్నాడు.

ఇషాంత్, షమీ, ఉమేశ్ అనువజ్ఞలైన బౌలర్లు

ఇషాంత్, షమీ, ఉమేశ్ అనువజ్ఞలైన బౌలర్లు

"భువీ, బుమ్రా లేకపోయినా ఇషాంత్, షమీ, ఉమేశ్ రూపంలో అనువజ్ఞలైన బౌలర్లు ఉన్నారు. వీరు స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ వారి ప్రతిభ చాటుకున్నారు. ఇంగ్లండ్ లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. సరైన లెంగ్త్‌తో సుదీర్ఘంగా బంతులు వేయడం బౌలర్లకు సవాల్‌గా నిలుస్తుంది" రహానే తెలిపాడు.

ఫలితం గురించి ఆలోచిస్తే ఒత్తిడి

"ఫలితం గురించి ఆలోచిస్తే అది అంతిమంగా ఒత్తిడి కలిగిస్తుంది. తుది జట్టు కూర్పు గురించి నాకు అంతగా తెలియదు, కానీ, కుల్దీప్ ఉంటే ఖచ్చితంగా ప్రభావం కనిపిస్తుంది. టీ20, వన్డేల్లో రాణించిన కుల్దీప్.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేస్తాడు. లెగ్‌స్పిన్నర్ అదిల్ రషీద్ ఎంపిక మమ్మల్ని ఏం ఆశ్చర్యపరచలేదు" అని రహానే అన్నాడు.

తొలి టెస్టు బర్మింగ్‌హామ్‌లో

తొలి టెస్టు బర్మింగ్‌హామ్‌లో

ఇదిలా ఉంటే, తొలి టెస్టు బర్మింగ్‌హామ్‌లో వర్షం కారణంగా ఆదివారం టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు అయింది. సోమవారం వర్ష సూచన లేకపోవడంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు.

టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో కోహ్లీసేన

ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటికే టీ20 సిరిస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన, మూడు వన్డేల సిరిస్‌ను 1-2తేడాతో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కసితో కోహ్లీసేన ఉంది.

Story first published: Tuesday, July 31, 2018, 11:57 [IST]
Other articles published on Jul 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X